Movie News

హను పనితనం మీద ఇన్ని కామెంట్లా

టాలీవుడ్ దర్శకుల్లో వివాదాలకు దూరంగా కాసింత ఎక్కువ కల్ట్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుల్లో హను రాఘవపూడి ఒకరు. అందాల రాక్షసి నుంచి సీతారామం వరకు ఆ బ్రాండ్ ని కాపాడుకుంటూ వస్తున్నారు. పడి పడి లేచే మనసు ఎంత డిజాస్టర్ అయినా దాన్ని ఇష్టపడే వర్గం లేకపోలేదు. అలాంటి డైరెక్టర్ కాంబోలో ప్రభాస్ ప్యాన్ ఇండియా మూవీ అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో వేరే చెప్పాలా. అందుకే ఫౌజీ మీద ప్రత్యేకమైన బజ్ నెలకొంటూ వచ్చింది. నిన్న ఇంట్రో టీజర్ ఒకటి రిలీజ్ చేశారు.

ప్రభాస్ పుట్టినరోజు ఇంకో మూడు గంటల్లో అయిపోతుందనే టైంలో వీడియోని విడుదల చేయడం అభిమానుల అసహనానికి కారణమయ్యింది. ఇంత ఆలస్యం చేయడం పట్ల వాళ్ళు నిన్న ఉదయం నుంచే సోషల్ మీడియా వేదికగా నిలదీయడం మొదలుపెట్టారు. అయితే రెండున్నర నిమిషాల కంటెంట్ లో ఎక్కువ రివీల్ చేయకపోయినా ఉన్నదాంట్లోనే కామెంట్స్, ట్రోల్స్, లాజికల్ క్వశ్చన్స్ అన్నీ బయట పెడుతున్నారు. అవన్నీ హను పనితనాన్ని టార్గెట్ చేస్తున్నాయి.

అసలు హిట్లర్ కు ఇంగ్లీష్ రాదని ఒకరు, సుభాష్ చంద్ర బోస్ గెటప్ అచ్చం డాక్టర్ అంబెడ్కర్ లా ఉందని ఇంకొకరు, నలభై దశకంలో ఒక గూఢచారి సైనికుడికి అంత పెద్ద మారణాయుధం ఎలా వస్తుందని వేరొకరు ఇలా రకరకాల లాజిక్కులు తీయడం మొదలుపెట్టారు. కళ్యాణ్ రామ్ డెవిల్ లో చూపించిన బోస్ రిఫరెన్స్ ని ఇంకొందరు తవ్వి తీశారు. స్పై అంటూనే ఏ నగరంలో ఫౌజీ ఉన్నాడని సుభాష్ చంద్రబోస్ ద్వారా చెప్పించడం మరీ క్రియేటివ్ లిబర్టీ అయిపోయిందని అంటున్నారు.

ఇదంతా హను రాఘవపూడి దృష్టికి వెళ్లకుండా అయితే ఉండదు. ఒకటి మాత్రం నిజం. ఈయన్ని ఏ మాత్రం తక్కువంచనా వేయడానికి లేదు. సీతారామం పెద్దగా హైప్ లేకుండా వండర్స్ చేయడం చూశాం. అలాంటిది ప్రభాస్ తో సినిమా చేస్తున్నప్పుడు స్క్రిప్ట్ విషయంలో ఒకటికి పదిసార్లు అలోచించి అడుగులు వేస్తారు. బర్త్ డేకి కంపల్సరిగా ఇవ్వాలి కాబట్టి ఇది ఇచ్చారు కానీ హను ఇవ్వబోయే అసలు ప్రమోషనల్ కంటెంట్ వేరే లెవెల్ లో ఉంటుందట. డార్లింగ్ ఫ్యాన్స్ కొంచెం ఓపిక పట్టక తప్పదు.

This post was last modified on October 24, 2026 11:03 am

Share

Recent Posts

కాయితంకి కలిసి వస్తున్న వివాదాలు

చిన్న సినిమాలకు మార్కెటింగ్ చేసుకుని ఓపెనింగ్స్ వచ్చేలా ప్రేక్షకులని ప్రభావితం చేయడం నిర్మాతలకు పెద్ద సవాల్ గా మారిపోయింది. దీంతో…

3 hours ago

మన తెలుగులో ఎప్పటికి ఇలాంటి సినిమా రాదు

రాష్ట్రాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ఆహార అలవాట్లు ఎలా వేర్వేరుగా ఉంటాయో సినిమాలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. గత…

3 hours ago

సినిమా కోసం కాలేజీకి సెలవా?

కాలేజీల్లో సినిమా ఈవెంట్లు చెయ్యడం ఈ మధ్య ట్రెండుగా మారింది. దాని వల్ల సినిమాలకు ప్రయోజనమేనా.. అదే సమయంలో కాలేజీల్లో…

3 hours ago

‘హనుమాన్’ను ఇబ్బందిపెట్టడంపై మహేష్ కోప్పడ్డాడా?

2024 సంక్రాంతి టైంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల భారీ సినిమా ‘గుంటూరు కారం’ మీద.. ‘హనుమాన్’ అనే చిన్న…

4 hours ago

రామ్ చరణ్ సరసన కొత్త అందం?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ‘రంగస్థలం’ తర్వాత…

6 hours ago

రాహుల్ సలహా ఆచరణ సాధ్యమేనా

రణబాలి దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ అనంతపురంలో జరిగిన సక్సెస్ మీట్ లో ఒక మంచి విషయం చెప్పారు. ఇకపై బిజినెస్…

6 hours ago