మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటించబోతుండడంతో ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఇంకా సెట్స్ మీదికి వెళ్లకముందే సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జోరందుకున్నాయి. ముందుగా సంగీత దర్శకుడి విషయంలోనే పెద్ద డిస్కషన్ నడిచింది.
సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడైన దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి పని చేయడం లేదని.. తన స్థానంలోకి వేరొకరు వస్తున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముందేమో ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్ శశ్వత్ సచ్దేవ్ పేరు వినిపించింది. ఆ తర్వాత అనిరుధ్ రవిచందర్ పేరు తెరపైకి వచ్చింది. కానీ అధికారికంగా ఏ విషయం ఇంకా ఖరారరవ్వలేదు.
ఈలోపు ఈ సినిమాలో కథానాయిక గురించి చర్చ ఊపందుకుంది.
చరణ్‌కు జోడీగా కొత్త అందాన్ని పెట్టి ఈ సినిమాకు కొత్త లుక్ తీసుకురావాలని సుకుమార్ చూస్తున్నాడట. ‘సైయారా’ సినిమాతో దేశవ్యాప్తంగా కుర్రకారు గుండెలను దోచిన బాలీవుడ్ బ్యూటీ అనీత్ పడ్డా ఈ చిత్రంలో కథానాయికగా నటించబోతున్నట్లు ఓ వార్త హల్చల్ చేస్తోంది. స్వయంగా దీని గురించి సుకుమార్ హింట్ ఇచ్చినట్లుగా ఒక వీడియో కూడా తిరుగుతోంది.
తన కొత్త చిత్రంలో హీరోయిన్ గురించి AP అనే అక్షరాలతో సుకుమార్ హింట్ ఇచ్చినట్లు చెబుతున్నారు. అనీత్ నిజంగా ఈ సినిమాలో నటించేట్లయితే ఆమె ఈ సినిమాకు అసెట్ అవుతుందనడంలో సందేహం లేదు. మరోవైపు ‘దురంధర్’ భామ సారా అర్జున్ ఈ చిత్రంలో హీరోయిన్ అంటూ మరో ప్రచారం కూడా నడుస్తోంది. కొన్ని రోజుల కిందటే ఈ చిత్రానికి ఆఫీస్ తెరిచారు. త్వరలోనే ముహూర్త వేడుక జరగనుంది. ఈ ఏడాది చివరి లోపే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది.
This post was last modified on October 24, 2026 10:52 am
రణబాలి దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ అనంతపురంలో జరిగిన సక్సెస్ మీట్ లో ఒక మంచి విషయం చెప్పారు. ఇకపై బిజినెస్…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబందించి నామినేషన్ల పర్వంలో అక్కడక్కడా ఘర్షణలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు…
‘పెళ్ళిచూపులు’ లాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన తరుణ్ భాస్కర్.. తర్వాత దశాబ్ద కాలంలో దర్శకుడిగా రూపొందించింది…
ఇడుపు కాయితం.. ఈ పేరుతో సినిమా అనౌన్స్ చేసినపుడు సోషల్ మీడియాలో ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. ఇప్పుడీ సినిమా…
స్టార్ హీరోల పుట్టినరోజులు హఠాత్తుగా డిసైడ్ కావు. ప్రతి సంవత్సరం అదే రోజు రిపీట్ గా వస్తుంది. వాళ్ళ వయసులు…
మూవీ లవర్స్ దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కలయిక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో వెంకటేష్ సినిమా. అది ఆదర్శ కుటుంబం…