కెజిఎఫ్, సలార్ రూపంలో తనకంటూ కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తను డైరెక్ట్ చేయకపోయినా కేవలం కథను ఇచ్చాడన్న కారణంతో హోంబాలే ఫిలిమ్స్ బఘీరా తీస్తే అది కన్నడలో పెద్ద బిజినెస్ చేసుకుంది. అనుకున్నంత ఫలితం రాకపోయినా నీల్ పర్యవేక్షణలో తీశారనే టాక్ ప్రేక్షకులను దానివైపు వచ్చేలా చేసింది. తాజాగా విడుదలవుతున్న హారర్ మూవీ 418కి ప్రశాంత్ నీల్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. మైత్రి అందుకే తెలుగు హక్కులు తీసుకుంది.
డ్రాగన్ నిర్మాతలు కాబట్టి మైత్రి దీన్ని ప్రమోట్ చేయడంలో ఆశ్చర్యం లేదు కానీ ముందు రోజు రాత్రి వేసిన ప్రీమియర్ల టికెట్లు వేగంగా అమ్ముడుపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే ఇది రెగ్యులర్ యాక్షన్ మూవీ కాదు. స్టార్లు లేరు. సీరియస్ గా దెయ్యాల కాన్సెప్ట్ తో తీశారు. మచ్చుకు కూడా కామెడీ ఉండదు. పైగా ఒంటరిగా చూడొద్దంటూ ముందే వార్నింగులు గట్రా ఇచ్చారు. ఇదంతా హైప్ పెరగడానికి దోహదపడింది. స్పెషల్ షోలు చూద్దామని జనం డిసైడయ్యారు.
చాలా కాలంగా పూర్తి సీరియస్ గా హారర్ మూవీ రాలేదన్నది వాస్తవం. వెబ్ సిరీస్ లు బోలెడు వచ్చాయి కానీ థియేటర్ ఎక్స్ పీరియన్స్ లో కిక్కు వేరే ఉంటుంది. అందుకే 418 వైపు ఇంతమంది మొగ్గు చూపుతున్నారు. రెండు రోజుల ముందు హైదరాబాద్ విమల్ థియేటర్ లో వేసిన షోకు మంచి రెస్పాన్స్ కనిపించింది. సౌండ్, థ్రిల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. కామన్ జనాల టాక్ ఏంటనేది మాత్రం ఇవాళ అర్ధరాత్రి దాటాకే బయటికి వస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయాలి.
ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేశారంటే ఇందులో చాలా బలమైన కంటెంట్ ఉంటుందని మూవీ లవర్స్ నమ్ముతున్నారు. రాజమౌళి డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, సందీప్ రెడ్డి వంగ రోమాంచకం వెనుక నిలబడ్డా పని జరగలేదు. ఒకవేళ నీల్ కనక ఇప్పుడీ 418తో సక్సెస్ అందుకుంటే అదో స్పెషల్ మైల్ స్టోన్ అవుతుంది. కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ రూమ్ చుట్టూ తిరుగుతుంది. షాకింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయట.
This post was last modified on October 22, 2026 9:10 pm
225 పరుగులు చేసినా న్యూజిలాండ్‌కు విజయం దక్కలేదు. టీమ్ఇండియా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేదించింది. అయితే…
మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు.. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల బరిలో నిలవడం.. మేయర్ పదవి మీద గురి పెట్టడం…
హీరో, హీరోయిన్ ఎవరైనా సక్సెస్ ఎక్కువ కాలం లేకపోతే ఆటోమేటిక్ గా రేసులో వెనుకబడటం జరుగుతుంది. అందులోనూ పెళ్ళయిపోతే ఇక…
ఒకే నెలలో రెండు డేట్లు మార్చుకున్న ఆదర్శ కుటుంబం ఏకే 47 ఫైనల్ గా అక్టోబర్ 30 లాక్ చేసుకున్న…
ఇంకా థియేటర్లలోనే రిలీజ్ కాలేదు. అప్పుడే ఓటీటీలో సినిమాను చూడ్డం గురించి చర్చేంటి అనిపిస్తోందా? ఐతే ‘రామాయణం’ సినిమా మేకర్స్…
2027 సంక్రాంతికి ఏ చిరంజీవి సినిమా విడుదలవుతుందనే దాని మీద మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలయ్యిందని మెగా కాంపౌండ్ టాక్. జనవరి…