ఇంకా థియేటర్లలోనే రిలీజ్ కాలేదు. అప్పుడే ఓటీటీలో సినిమాను చూడ్డం గురించి చర్చేంటి అనిపిస్తోందా? ఐతే ‘రామాయణం’ సినిమా మేకర్స్ చేసిన ప్రకటనే ఈ చర్చకు కారణం. ఈ సినిమా డిజిటల్ హక్కులను జియో హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. హిందీ సినిమాలకు 8 వాారాల గ్యాప్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.
కాబట్టి నవంబరు 5న ‘రామాయణం’ థియేటర్లలో రిలీజయ్యాక.. ఈ సినిమాను డిజిటల్‌గా చూడాలంటే జనవరి తొలి వారం వరకు ఎదురు చూడాల్సింది. కానీ అప్పుడు కూడా సినిమాను హాట్ స్టార్‌లో ఉచితంగా చూసేందుకు అవకాశం లేదు. ఈ సినిమాను పే పర్ వ్యూ పద్ధతిలోనే డిజిటల్‌గా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ విషయాన్ని ఇప్పుడే అధికారికంగా ప్రకటించారు కూడా.
ఇంకా రేటు ఎంత అన్నది నిర్ణయించలేదు కానీ.. ‘రామాయణం’ను ఓటీటీలో చూడాలంటే సబ్‌స్క్రిప్షన్‌కు తోడు ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిందే. హాలీవుడ్ హిట్ సినిమాలకు కొన్ని నెలల పాటు ఇలా పే పర్ వ్యూ పద్ధతిని పెట్టడం మామూలే. కొన్ని నెలల తర్వాత ఫ్రీ స్ట్రీమింగ్ ఇస్తారు. ఐతే ఇండియన్ సినిమాలకు ఇలాంటి పద్ధతి అమలు చేయడం అరుదు. ఆమిర్ ఖాన్ తన ‘సితారే జమీన్ పర్’ సినిమాను యూట్యూబ్‌లో ఇలాగే రిలీజ్ చేసి మంచి ఫలితమే అందుకున్నాడు.
కానీ వేరే ఫిలిం మేకర్స్ ఈ సాహసం చేయలేకపోతున్నారు. ‘రామాయణం’ మేకర్స్ మాత్రం ధీమాగా పే పర్ వ్యూ పద్ధతికి వెళ్లిపోయారు. ఐతే సినిమాకు థియేటర్లలో ఎలాంటి ఫలితం వస్తుందన్నది కీలకం. అక్కడ రిజల్ట్ అటు ఇటు అయితే.. ఈ ఐడియా బూమరాంగ్ కావచ్చు. రణబీర్ కపూర్, సాయిపల్లవి రాముడు-సీతగా.. యశ్ రావణుడిగా నటించిన ‘రామాయణం’ను నితీశ్ తివారి దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించాడు. దీపావళి కానుకగా నవంబరు 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on October 22, 2026 3:20 pm
ఒకే నెలలో రెండు డేట్లు మార్చుకున్న ఆదర్శ కుటుంబం ఏకే 47 ఫైనల్ గా అక్టోబర్ 30 లాక్ చేసుకున్న…
2027 సంక్రాంతికి ఏ చిరంజీవి సినిమా విడుదలవుతుందనే దాని మీద మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలయ్యిందని మెగా కాంపౌండ్ టాక్. జనవరి…
రాష్ట్రంలో ఫేక్ రాయుళ్ళు బరితెగిస్తున్నారు. ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే కుట్రలకు పాల్పడుతున్నారు. కూటమి…
క్రికెట్‌లో బ్యాటుకు బంతి తగిలిందో లేదో తెలుసుకోవడానికి థర్డ్ అంపైర్లు టెక్నాలజీ సాయం తీసుకుంటారు. ముఖ్యంగా వికెట్ కీపర్ క్యాచ్…
కూటమిలో కుంపటి పెట్టేందుకు వైసీపీ నేతలు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోరు. టీడీపీ, జనసేనల మధ్య చిన్న నిప్పు రవ్వ…
టాలీవుడ్ దర్శకులు ఈ మధ్య ఎదురుకుంటున్న సమస్య లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులను వెతికి పట్టుకోవడం. నిన్న జరిగిన దొంగ నా…