Movie News

మెగా కన్ఫ్యూజన్ మళ్ళీ మొదలయ్యింది

2027 సంక్రాంతికి ఏ చిరంజీవి సినిమా విడుదలవుతుందనే దాని మీద మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలయ్యిందని మెగా కాంపౌండ్ టాక్. జనవరి 13 ఎట్టి పరిస్థితుల్లో కాకాని దింపాలని పక్కా ప్లాన్ తో దర్శకుడు బాబీ కొల్లి షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి చిరు సహకారం నిండుగా ఉంది. ఎక్కడా ఆలస్యం లేకుండా అన్నీ అనుకున్న టైంకి అయిపోయేలా తనవంతు కోఆపరేషన్ అందిస్తున్నారు. ఇంకో ముప్పై శాతం అటుఇటుగా బ్యాలన్స్ ఉందట. అది కూడా డిసెంబర్ రెండో వారంకల్లా అయిపోతుందని టాక్.

అయితే విశ్వంభరని పండగ బరిలో దింపేందుకు యువి క్రియేషన్స్ చేస్తున్న ప్రయత్నాలు ఆగడం లేదు. ఓటిటిలో మంచి డీల్ దక్కాలంటే జనవరిలోనే థియేటర్ రిలీజ్ జరగాలనే చిక్కుముడి వల్ల ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో నిర్మాత ఉన్నట్టు వినికిడి. ఒకవేళ ఇది మిస్ అయితే మార్చి 26 మరో ఆప్షన్ పెట్టుకున్నారు కానీ అది కూడా వారణాసి మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ రాజమౌళి కనక ఏప్రిల్ 7 వస్తానంటే దానికన్నా, ముందు తక్కువ గ్యాప్ లో పెద్ద సినిమా వచ్చే రిస్క్ చేయదు.

తాజా అప్డేట్ ప్రకారం విశ్వంభర ఫైనల్ కాపీ సిద్ధమయ్యాక అప్పుడు డిసైడ్ చేద్దామని చిరంజీవి ఫిక్సైనట్టు తెలిసింది. అవుట్ ఫుట్ కనక చాలా బాగా వచ్చి ఉంటే కాకా మేకర్స్ ని కన్విన్స్ చేయొచ్చనేది ఒక ఆలోచన కావొచ్చు. ఎందుకంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇద్దరూ చిరు వీర ఫ్యాన్స్ కాబట్టి. అలాని వ్యాపార ప్రయోజనాలను తాకట్టు పెట్టలేరు కానీ ఇప్పటికే విపరీతమైన ఆలస్యంతో నరకం చూసిన విశ్వంభర మీద కూడా కొంచెం విచక్షణ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదంతా తేలకపోవడం వల్లే దసరా పండక్కు శుభాకాంక్షలు చెబుతూ కాకా కొత్త పోస్టర్ రాలేదని తెలిసింది. బాబీ అయితే ఒకటి సిద్ధం చేశారట కానీ చిరు సూచన మేరకు ఆగిపోయారట. సరే ఏ నిర్ణయం తీసుకున్నా వీలైనంత త్వరగా ముగించాలి. ఎందుకంటే ఈ ఏడాదిలో ఇంకో 70 రోజులు మాత్రమే మిగిలాయి. విశ్వంభర, కాకాలో ఏది రావాలన్నా మెల్లగా ఇప్పటి నుంచే ప్రమోషన్లు మొదలు పెట్టాలి. లేదంటే ఇలాంటి డౌట్లతో అభిమానులు నిత్యం సతమతమవుతూనే ఉంటారు.

This post was last modified on October 22, 2026 1:21 pm

Share

Recent Posts

డీసీఎం పవన్ రాజీనామా ఎందుకు చేస్తారు?

రాష్ట్రంలో ఫేక్ రాయుళ్ళు బరితెగిస్తున్నారు. ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే కుట్రలకు పాల్పడుతున్నారు. కూటమి…

25 minutes ago

టీమ్ఇండియా సిరీస్‌లో కొత్త టెక్నాలజీ

క్రికెట్‌లో బ్యాటుకు బంతి తగిలిందో లేదో తెలుసుకోవడానికి థర్డ్ అంపైర్లు టెక్నాలజీ సాయం తీసుకుంటారు. ముఖ్యంగా వికెట్ కీపర్ క్యాచ్…

1 hour ago

జనసైనికులను రెచ్చగొడుతున్నారా అంబటి?

కూటమిలో కుంపటి పెట్టేందుకు వైసీపీ నేతలు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోరు. టీడీపీ, జనసేనల మధ్య చిన్న నిప్పు రవ్వ…

1 hour ago

రజిత ఆవేదన కరెక్టేగా

టాలీవుడ్ దర్శకులు ఈ మధ్య ఎదురుకుంటున్న సమస్య లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులను వెతికి పట్టుకోవడం. నిన్న జరిగిన దొంగ నా…

1 hour ago

డ్యామేజ్ తగ్గించే ప్రయత్నాలు ఎన్ని చేసినా

సరిగ్గా నాలుగు వారాలకు ప్యారడైజ్ మూవీ ఓటిటిలో వచ్చేసింది. న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్…

2 hours ago

రజినీకి ఎంత ముట్టింది?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏమాత్రం కష్టపడకుండా, సుకుమారంగా సినిమాలు చేస్తూనే వందల కోట్ల వసూళ్లు రాబట్టే హీరో అంటే సూపర్…

5 hours ago