దసరాని లక్ష్యంగా పెట్టుకుని విడుదలైన అయిదు సినిమాల్లో నాలుగు తమ టార్గెట్ ని దాదాపుగా అందుకునే పనిలో ఉండగా ఒకటి మాత్రం ఎదురీదుతున్న వైనం వసూళ్ళలో కనిపిస్తోంది. అదే క్రేజీ కళ్యాణం. అలాని ఇదేదో కొత్త ఆర్టిస్టులు నటించిన మూవీ కాదు. అనుపమ పరమేశ్వరన్ మెయిన్ రోల్ పోషించింది. ఈ మధ్య తన భుజాల మీద మోసి సినిమాలను గెలిపిస్తున్న నరేష్ ముఖ్యపాత్రలో కనిపించారు. ప్రమోషన్లు గట్రా బాగా జరిగాయి. అయినా సరే కంటెంట్ పరంగా అంతగా వర్కౌట్ కాలేదు.
దీనికి కారణం సింపుల్. ఎమోషనల్, ఎంటర్ టైనింగ్ గా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ ఉన్నప్పటికీ దర్శకుడు భద్రప్ప గాజుల దాన్ని హ్యాండిల్ చేసిన విధానం సంపూర్ణంగా లేకపోవడంతో ప్రేక్షకులను మెప్పించడంలో క్రేజీ కళ్యాణం తడబడింది. కూతురి పెళ్లి కోసం తాపత్రయపడే తండ్రి సంఘర్షణను ఇప్పటి పరిస్థితులకు, యువత ఆలోచనలకు ముడిపెట్టడం బాగానే ఉంది కానీ దానికి వినోదం, భావోద్వేగాలు బ్యాలన్స్ గా కుదిరినప్పుడే మెప్పించడం సాధ్యమతుంది. దీంట్లో అవి సరిగా కుదరలేదు.
తండ్రి కూతుళ్ళ మధ్య సంఘర్షణ ఇప్పటిది కాదు. నువ్వే నువ్వే నుంచి ఎన్నోసార్లు చూశాం. క్రేజీ కళ్యాణం కూడా అదే లైన్ లో వెళ్తుంది. స్వేచ్ఛగా స్వంత కాళ్లపై నిలబడి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయికి, పెద్ద సంబంధం తెచ్చి బిడ్డని భోగభాగ్యాల్లో ముంచెత్తాలనుకునే నాన్నకు మధ్య జరిగే కాంఫ్లిక్ట్ కొత్తది కానప్పుడు ట్రీట్ మెంట్ అయినా డిఫరెంట్ గా ఉండాలి. సినిమాలోని పాటలు వైరల్ కావాలి. ఇవి జరగనప్పుడు ఓపెనింగ్స్ నుంచే సమస్య వస్తుంది.
మరీ బ్యాడ్ కాకపోయినా కాంపిటీషన్ లో జైలర్ 2, రణబాలి, గరివిడి లక్ష్మిలు బలంగా పెర్ఫార్మ్ చేయడంతో పాటు అందరికంటే ముందు వచ్చిన కామ్రేడ్ కళ్యాణ్ కూడా డీసెంట్ రన్ కొనసాగించడం క్రేజీ కళ్యాణంని ఇబ్బంది పెట్టింది. ఎబోవ్ యావరేజ్ టాక్ వచ్చినా ఆడియన్స్ సినిమాలు చూస్తున్న ట్రెండ్ లో స్క్రిప్ట్ మీద ఇంకొంచెం వర్క్ జరిగి ఉంటే క్రేజీ కళ్యాణం కూడా మంచి ఆప్షన్ అయ్యేది. కానీ తృటిలో ఆ అవకాశాన్ని పోగొట్టుకుంది. టీమ్ అయితే వీకెండ్ పికప్ మీద ఆశలు పెట్టుకుంది.
This post was last modified on October 21, 2026 1:00 pm
రిలీజ్ డేట్ల వాయిదాల గురించి నాగార్జున కొన్ని నెలలుగా సందర్భం దొరికినప్పుడంతా తన స్వరం వినిపిస్తూనే ఉన్నారు. లెనిన్ నుంచి…
ఒక చిన్న సినిమా. కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్ లో తీశారు. షూటింగ్ చివరి దశలో డబ్బులు అయిపోతే దర్శకుడు…
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. పుంగనూరు, పులివెందుల, కడప, రాయచోటి…
మైత్రి మూవీ మేకర్స్, ప్రశాంత్ నీల్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్. అయితే ఈ ఇద్దరూ…
సాయిదుర్గ తేజ్ గత రెండేళ్లకు పైగా అంకితమైపోయిన సంబరాల ఏటిగట్టు గతంలో ప్రకటించిన దాని ప్రకారం జనవరి 12 వచ్చేయాలి.…
ఇంకో పధ్నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.…