ఇంకో నాలుగు రోజుల్లో విజయదశమి పండగ రానుంది. సుదీర్ఘమైన సెలవులు కావడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ముందే మొదలయ్యింది. అక్టోబర్ 9 వచ్చిన వాటిలో కామ్రేడ్ కళ్యాణ్ ఒకటే ఉనికిని చాటుకోగా నిర్మాతలు చెప్పిన దాని ప్రకారం చాలా ఈజీగా బ్రేక్ ఈవెన్ దాటిపోయింది. నెంబర్లు అంతగా పెద్దగా వచ్చాయా లేదానేది పక్కనపెడితే శ్రీవిష్ణుకి రెండు ఫ్లాపుల తర్వాత కొంత ఊరట దక్కింది. అయితే తాను కోరుకున్న పెద్ద ఫలితం రాలేదు కానీ ఉన్నంతలో అందరూ హ్యాపీస్.
హైప్ ఉన్న సినిమాల్లో ముందుగా వచ్చిన జైలర్ 2 బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. ఎపి తెలంగాణ మెయిన్ సెంటర్ల ఆక్యుపెన్సీలు చూస్తుంటే టాక్ మిక్స్డ్ గా ఉన్నప్పటికీ జనం రజనీకాంత్ స్వాగ్ ఎంజాయ్ చేయడానికి ఫిక్స్ అయినట్టు బుకింగ్స్ చూస్తే అర్థమైపోతుంది. అయితే థియేటర్ బిజినెస్ మొత్తం రికవరీ అవుతుందా అంటే మాత్రం ఇప్పుడే చెప్పలేం. ఎందకంటే నలభై అయిదు కోట్ల దాకా దీని మీద పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో లాంగ్ రన్ దక్కితేనే రికవరీ అవుతుంది.
ఇంచుమించు రణబాలిది కూడా ఇదే పరిస్థితి. డీసెంట్ ఓపెనింగ్ దక్కింది కానీ దీన్ని మరింత పెంచుకోవాలి. ప్రాథమిక స్పందన దీనికీ మిశ్రమంగా ఉండటంతో వీకెండ్ పికప్ మీద నిర్మాతలు భారీ ఆశలు పెట్టుకున్నారు. నాన్ స్టాప్ ప్రమోషన్లు కొనసాగించబోతున్నారు. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషించిన క్రేజీ కల్యాణం ఇంకా జనాల దృష్టిలో పూర్తిగా పడలేదు. నిలదొక్కుకుంటుందా లేదానేది సండే సాయంత్రానికి క్లారిటీ వస్తుంది. బుకింగ్స్ అయితే చాలా సాధారణంగా ఉన్నాయి.
చివర్లో వచ్చిన గరివిడి లక్ష్మి బయోపిక్ కావడం వల్ల కమర్షియల్ ఫ్లేవర్ ఉండదు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని తన బుర్రకథలతో, పాటలతో హోరెత్తించిన ఈ కళాకారిణి గురించి అవగహన ఉన్న వాళ్ళు ఈ జనరేషన్ లో తక్కువ. మహానటిలా కనెక్ట్ అయితే బాక్సాఫీస్ వద్ద నెగ్గొచ్చు కానీ రజనీకాంత్, విజయ్ దేవరకొండ మధ్య ఆనంది ఏ మేరకు నెట్టుకొస్తుందో చూడాలి. ఇదంతా ఎలా ఉన్నా దసరాకు టయర్ 1 టాలీవుడ్ హీరో సినిమా ఒక్కటీ లేకపోవడం ఎగ్జిబిటర్ వర్గాలు లోటుగానే ఫీలవుతున్నాయి.
This post was last modified on October 17, 2026 11:06 am
భార్య పుట్టినరోజు నాడే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అంతకుముందు ఉదయం ఆ ఉద్యోగి…
మామూలుగా పెద్ద స్టార్ల కొడుకులు సినీ రంగంలోకి అడుగుపెడితే.. తండ్రి పేరును వాడుకోవడానికే ప్రయత్నిస్తారు. తండ్రి రెఫరెన్సులను తమ సినిమాల్లో…
యువత పెళ్లిళ్లకు దూరంగా ఉండడంతో సింగపూర్ ప్రభుత్వం మాత్రం ఓ కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. పెళ్లి చేసుకోవాలనుకునే యువతీ యువకులను…
వారం కిందటే భారతీయ సినీ పరిశ్రమ నానా పటేకర్ లాంటి గొప్ప నటుడిని కోల్పోయింది. ఆరోగ్యంగా, యాక్టివ్గా ఉన్న ఆయన…
ఇరుముడి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఒక కొత్త ఫార్ములా సృష్టించింది. మాములుగా స్టార్ హీరోలు దేవుళ్ళ మాల వేసుకునే క్యారెక్టర్లు…
స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వేగం పుంజుకుంది. మంచి ముహుర్తాలు ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు హడావుడిగా నామినేషన్లు…