Movie News

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. విక్ర‌మ్ కుమార్.. ఒక ల‌వ్ స్టోరీ

ఈ శుక్ర‌వారం ర‌ణ‌బాలి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ ఉన్న‌ప్ప‌టికీ.. విజ‌య్ పెర్ఫామెన్స్‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. ఐతే టాక్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ ర‌ణ‌బాలి పెద్ద హిట్ అవుతుంద‌ని ఈ సినిమా స‌క్సెస్ మీట్‌లో ధీమా వ్య‌క్తం చేశాడు విజ‌య్. ఐతే తాము ఈ సినిమా తీసింది హిట్ కోసం కాద‌ని.. వ‌సూళ్ల సంగ‌తి కూడా ప‌క్క‌న పెడ‌దామ‌ని, చ‌రిత్ర‌లో మ‌రుగున‌ప‌డిపోయిన ఒక క‌థ‌ను ఇప్ప‌టి జ‌నాల‌కు చెప్పాల‌న్న ప్ర‌య‌త్న‌మే ఈ సినిమా అని విజ‌య్ వ్యాఖ్యానించాడు.

ఇక పెద్ద స్టార్లే కాక‌.. మిడ్ రేంజ్ హీరోలు కూడా లార్జ‌ర్ ద‌న్ లైఫ్ క్యారెక్ట‌ర్లే చేస్తుండ‌డం.. మాస్ ఇమేజ్ కోసం తాప‌త్ర‌య ప‌డుతుండ‌డం.. ఈ క్ర‌మంలో ల‌వ్ స్టోరీల‌కు, ఎంట‌ర్టైన‌ర్ల‌కు దూరం అయిపోతుండ‌డం గురించి ఒక ప్ర‌శ్న ఎదురుకాగా.. దానికి ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చాడు విజ‌య్. ఒక సినిమా ఒప్పుకునేట‌పుడు.. దాని బ‌డ్జెట్, కాన్వాస్, ఇమేజ్, నంబ‌ర్స్ ఇవేవీ చూడ‌న‌ని.. ఈ క‌థ మ‌నం చెప్పాలా వ‌ద్దా అన్న‌ది మాత్ర‌మే ఆలోచించి నిర్ణ‌యం తీసుకుంటాన‌ని అత‌ను స్ప‌ష్టం చేశాడు.

ఇక ల‌వ్ స్టోరీలు చేయ‌డం గురించి విజ‌య్ స్పందిస్తూ.. తాను మ‌నం ద‌ర్శ‌కుడు విక్ర‌మ్.కె.కుమార్‌తో ఒక అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్రం చేయ‌బోతున్న విష‌యం విజ‌య్ వెల్ల‌డించాడు.

ఈ సినిమా నిర్మాత ఎవ‌రు, ఎప్పుడు మొద‌ల‌వుతుంద‌న్న వివ‌రాలేవీ చెప్ప‌లేదు కానీ.. విక్ర‌మ్‌తో సినిమా ఉంటుంద‌ని మాత్రం విజ‌య్ క‌న్ఫ‌మ్ చేశాడు. తాను ఫ‌లానా టైపు సినిమానే చేయాల‌ని ఏమీ అనుకోనని, విక్ర‌మ్ త‌న ద‌గ్గ‌రికి ఆ క‌థ తెచ్చాడు కాబ‌ట్టి చేస్తున్నాన‌ని, అత‌ను ల‌వ్ స్టోరీ చెప్ప‌క‌పోతే ఈ సినిమా ఉండేది కాద‌ని చెప్ప‌డం ద్వారా.. త‌న వ‌ద్ద‌కు మంచి ప్రేమ‌క‌థ‌లు రావ‌ట్లేద‌ని చెప్ప‌క‌నే చెప్పాడు విజ‌య్. విజ‌య్ త‌ర్వాతి చిత్రం రౌడీ జ‌నార్ధ‌న కాగా, దాని త‌ర్వాత హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అద‌య్యాక విక్ర‌మ్ సినిమా ఉంటుంద‌న్న‌మాట‌.

This post was last modified on October 17, 2026 10:32 am

Share

Recent Posts

రవితేజ రూటు పట్టిన అల్లరి నరేష్

ఇరుముడి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఒక కొత్త ఫార్ములా సృష్టించింది. మాములుగా స్టార్ హీరోలు దేవుళ్ళ మాల వేసుకునే క్యారెక్టర్లు…

43 minutes ago

అందరికీ న్యాయం చేసిన టీడీపీ

స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వేగం పుంజుకుంది. మంచి ముహుర్తాలు ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు హడావుడిగా నామినేషన్లు…

53 minutes ago

అత్తాకోడళ్ల మధ్య కర్నూలు మేయర్ వార్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఎంతో మంది వైసీపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులు ఉన్నారు. ఈ పార్టీల తరఫున…

2 hours ago

ప్రెగ్నెన్సీ హింసని కాస్త తగ్గించడయ్యా

హిట్టు ఫ్లాపుల ముచ్చట కాసేపు పక్కనపెడితే ఎమోషన్ పేరుతో కమర్షియల్ దర్శకులు ఒకే పంథాలో ఆలోచించడం ఆశ్చర్యం కన్నా ఎక్కువగా…

2 hours ago

ఆన్‌లైన్ షాపింగ్‌లో చెత్త ట్రెండ్… దాండియా తరువాత రిటర్న్!

ఆన్‌లైన్‌లో బట్టలు ఆర్డర్ చేసి నచ్చకపోతే రిటర్న్ చేయడం రెగ్యులర్ గా జరిగేదే. కానీ కొందరు ఈ సదుపాయాన్ని దుర్వినియోగం…

3 hours ago

మాలాని మించిన మేజిక్ జరగాలి

ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆదర్శ కుటుంబం అక్టోబర్ 30 రావడం పక్కానే. వెంకటేష్ ఊటీ నుంచి రాగానే ఇంకో…

3 hours ago