కొన్ని సినిమాలు థియేటర్లలో బాగా ఆడతాయి. ఓటీటీలోకి వచ్చాక విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాయి. మరి కొన్ని సినిమాలేమో థియేటర్లలో బాగా ఆడవు. కానీ డిజిటల్‌గా రిలీజైనపుడు మంచి స్పందనే తెచ్చుకుంటాయి. థియేటర్లలో ఇరగాడేసిన ఇరుముడి సినిమాను ఓటీటీలో చాలామంది విమర్శించడం తెలిసిందే. ఐతే గత నెల పదో తారీఖున థియేటర్లలో రిలీజై వీకెండ్లోనే వాషౌట్ అయిపోయి డిజాస్టర్‌గా నిలిచిన సర్దార్-2 సినిమాకు మాత్రం ఇప్పుడు ఓటీటీలో మంచి స్పందనే వస్తోంది. థియేటర్లలో రిలీజైన మూడు వారాలకే ఈ సినిమాను డిజిటల్‌గా రిలీజ్ చేశారు.
అమేజాన్ ప్రైమ్ సంస్థ మూడు రోజుల కిందట ఈ సినిమాను స్ట్రీమ్ చేయడం మొదలుపెట్టింది. అప్పట్నుంచి దీనికి మంచి స్పందన వస్తోంది.
నేరుగా ఇండియా ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానానికి వెళ్లిపోయిన సర్దార్-2.. స్టడీగా అదే స్థానంలో కొనసాగుతోంది. ట్రెండ్ అవుతున్న తీరు చూస్తుంటే జనం ఈ సినిమాను ఎగబడి చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.
సర్దార్-2 గురించి థియేట్రికల్ రిలీజ్ టైంలో విపరీతమైన నెగెటివ్ పోస్టులు కనిపించాయి సోషల్ మీడియాలో. కానీ ఇప్పుడు దానికి భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సినిమాలో లోపాలున్నప్పటికీ.. కాన్సెప్ట్ మంచిదే అని, కొన్ని ఎపిసోడ్లు బాగున్నాయని, ఫస్టాఫ్ బాగానే వర్కవుట్ అయిందనే కామెంట్లు పెడుతున్నారు చూసిన వాళ్లు.
సెకండాఫ్ కొంచెం జాగ్రత్త పడి ఉంటే సినిమా బాగానే ఆడేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ క్యారెక్టర్లో కార్తి మేకప్.. ఎస్.జె.సూర్య లౌడ్ యాక్టింగ్ మీద మాత్రం నెగెటివ్ కామెంట్లే పడుతున్నాయి. దర్శకుడు పి.ఎస్.మిత్రన్ ఎంతో కష్టపడ్డాడని.. కానీ ఎగ్జిక్యూషన్ కొంచెం జాగ్రత్తగా చేసి ఉంటే బాగుండేదని అంటున్నారు.
ప్రైమ్‌లో ఇంకొన్ని రోజులు ఇలాగే సర్దార్-2 ట్రెండ్ అయితే.. ఓటీటీలో దీన్ని సూపర్ హిట్‌గా పరిగణించొచ్చేమో. ఈ చిత్రాన్ని ఏకంగా వంద కోట్ల బడ్జెట్లో తీయగా.. థియేట్రికల్ రన్ నుంచి అందులో నాలుగో వంతు కూడా వెనక్కి రాలేదు. సర్దార్ 3 కూడా తీయాలని విడుదలకు ముందు అనుకున్న కార్తి, మిత్రన్ రిజల్ట్ చూశాక ఆ ఆలోచనను మానుకునే ఉంటారేమో.
This post was last modified on October 8, 2026 10:05 am
కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…
ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…
కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…
జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…