ఈ ఏడాది తెలుగులో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో రణబాలి ఒకటి. విజయ్ దేవరకొండ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయినా సరే.. ఈ సినిమాకు హైప్ బాగానే ఉంది. అందుక్కారణం.. ఇది భారీ స్థాయిలో తెరకెక్కిన పీరియడ్ మూవీ కావడం.. ట్యాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ లాంటి ప్రామిసింగ్ మూవీస్ తీసిన రాహుల్ సంకృత్యన్ ఈ చిత్రాన్ని రూపొందించడం.. విజయ్‌కి జోడీగా తన భార్య రష్మిక మందన్నా నటించడం. టీం కూడా చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తోంది.
విజయ్, రష్మికలతో కలిసి చేసిన ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ చెప్పిన మాట సినిమా మీద అంచనాలు పెంచుతోంది. మామూలుగా తన సినిమాల గురించి పెద్దగా మాట్లాడని, ఎక్కువ గొప్పలు చెప్పుకోని రాహుల్.. రణబాలి గురించి, అందులో విజయ్ పాత్ర గురించి చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఇక నుంచి తెలుగులో రణబాలి తరహా బ్యాక్ డ్రాప్ ఉన్న పీరియడ్ ఫిలిం తీస్తుంటే.. విజయ్ పాత్రను రెఫరెన్స్‌గా తీసుకుంటారని రాహుల్ చెప్పాడు. ఈ క్యారెక్టర్ అంత గొప్పగా ఉంటుందని అతనన్నాడు. ఇక రణబాలి ప్రయోగాత్మక సినిమా కాదని, ఇది కమర్షియల్ సినిమానే అని రాహుల్ చెప్పాడు. ఒక మాస్ సినిమాలో ఉండే హైస్ ఈ సినిమాలో చాలా ఉన్నాయని.. ప్రేక్షకులకు గూస్ బంప్స్ గ్యారెంటీ అని కూడా అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. రాహుల్ లాంటి కామ్ గోయింగ్ డైరెక్టర్ ఇలాంటి పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం విశేషమే.
స్వాతంత్ర్యానికి పూర్వం రాయలసీమ ప్రాంతంలో జరిగిన కథతో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసింది. దసరా వీకెండ్లో ఈ నెల 16న జైలర్ లాంటి భారీ చిత్రంతో పోటీకి దిగుతున్న రణబాలి దర్శకుడు ఇచ్చిన ఎలివేషన్‌కు తగ్గట్లే ఉంటుందా.. ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా.. విజయ్ కోరుకుంటున్న బ్రేక్ ఇస్తుందా అన్నది చూడాలి.
This post was last modified on October 8, 2026 9:15 am
కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…
ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…
కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…
జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…