పూజా హెగ్డే ఊపు మామూలుగా లేదిప్పుడు. తెలుగులో ఇప్పుడు ఆమే నంబర్ వన్ హీరోయిన్ అనడంలో మరో మాట లేదు. తెలుగులో చివరగా విడుదలైన ఆమె సినిమా ‘అల వైకుంఠపురములో’ నాన్ బాహుబలి హిట్‌గా నిలిచింది.
అంతకుముందు మహేష్ బాబుతో ‘మహర్షి’, జూనియర్ ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’ లాంటి హిట్లు ఇచ్చిందామె. ప్రస్తుతం ప్రభాస్ లాంటి పెద్ద హీరోతో ‘రాధేశ్యామ్’ చేస్తోంది. హిందీలో సైతం ఆమెకు భారీ ఆఫర్లే ఉన్నాయి. ఇప్పుడు ఆమె తమిళంలో కూడా పాగా వేయడానికి చూస్తున్నట్లు సమాచారం.
పూజాకు కోలీవుడ్లో ఒక భారీ ఆఫరే వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళంలో నంబర్ వన్ హీరో అనదగ్గ విజయ్ సరసన పూజా నటించబోతోందట. సన్ పిక్చర్స్ నిర్మాణంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ చేయబోయే సినిమాలో పూజానే హీరోయిన్ అంటున్నారు.
నిజానికి ‘మాస్టర్’ తర్వాత విజయ్.. మురుగదాస్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ వాళ్లకు సినిమా చేయాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సినిమా నుంచి మురుగ తప్పుకున్నాడు. ఆ స్థానంలోకి కోలమావు కోకిల (తెలుగులో కో కో కోకిల) లాంటి వెరైటీ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నెల్సన్ దిలీప్ కుమార్ వచ్చాడు.
అతను ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా ‘డాక్టర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయింది. త్వరలోనే విజయ్ సినిమాను మొదలుపెట్టనున్నాడు. అతడి సరసన హీరోయిన్‌గా పలు పేర్లను పరిశీలించి తమిళ ప్రేక్షకులకు కొంచెం ఫ్రెష్‌గా ఉంటుందని పూజాను తీసుకోవాలని నిర్ణయించారట. పూజాను తీసుకుంటే తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి క్రేజ్ వస్తుంది.
పూజా బాలీవుడ్లోనూ ఫేమస్ కాబట్టి అదీ కలిసొచ్చేదే. ఐతే పూజాకు తెలుగులో ఇదే తొలి సినిమా కాదు. ఆమె స్టార్ స్టేటస్ తెచ్చుకోవడానికి ముందే తమిళంలో జీవా సరసన ‘మాస్క్’ అనే సినిమా చేసింది. అది ఆడలేదు. మళ్లీ ఇంత కాలానికి తమిళంలో భారీ చిత్రంతో అక్కడ పాగా వేయడానికి సిద్ధమవుతోందన్నమాట.
This post was last modified on January 19, 2021 1:50 pm
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…