తెలుగులో గ్లామర్ రోల్స్‌తో మామూలుగా హీరోయిన్ల లాగే కనిపించింది తాప్సి. ‘ఝుమ్మంది నాదం’ మొదలుకుని ఆమె ఇక్కడ చేసినవన్నీ రొటీన్ మాస్ మసాలా సినిమాలే. కానీ బాలీవుడ్లోకి వెళ్లాక ఆమె రాత మారిపోయింది. ‘బేబీ’, ‘నామ్ షబానా’, ‘పింక్’, ‘తప్పడ్’ లాంటి సినిమాలతో తాప్సికి ఎక్కడలేని పేరొచ్చింది.
ఆ సినిమాలు ఆమె ఇమేజ్‌నే మార్చేశాయి. ప్రస్తుతం కంగనా రనౌత్ తర్వాత అలాంటి ఇమేజ్, ఫాలోయింగ్ తాప్సికే సొంతం. ఆమె ప్రధాన పాత్రలో వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం ‘రాకెట్ రష్మి’ సహా రెండు మూడు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. కాగా తాప్సికి ఇప్పుడు కెరీర్లోనే అతి పెద్ద ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. ఆమె ఒక పెద్ద స్టార్ హీరో, ఒక గ్రేట్ డైరెక్టర్‌తో ఒకేసారి జట్టు కట్టే అవకాశం అందుకున్నట్లు సమాచారం.
వరుస ఫ్లాపులతో అల్లాడుతున్న షారుఖ్ ఖాన్.. రెండేళ్ల విరామం తీసుకుని జాగ్రత్తగా కొత్త సినిమాలు లైన్లో పెడుతున్న సంగతి తెలిసిందే. ‘పఠాన్’ అతడి రీఎంట్రీ మూవీ కాగా.. దీంతో పాటు అగ్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అతను రంగం సిద్ధం చేసుకున్నాడు. ‘పఠాన్’ పూర్తి కాగానే అది మొదలవుతుంది. ఈ చిత్రంలో షారుఖ్ సరసన తాప్సిన నటించనుందట.
షారుఖ్ ఖాన్‌తో నటించడమే పెద్ద అవకాశం అంటే.. రాజ్ కుమార్ హిరాని లాంటి గ్రేట్ డైరెక్టర్ దానికి దర్శకత్వం వహించడమంటే తాప్సికి ఇది బంపర్ ఆఫర్ అన్నట్లే. బాలీవుడ్లో తాప్సి ఇప్పటిదాకా పెద్ద హీరోల సరసన సినిమాలు చేసింది లేదు. ఒకేసారి ఆమె ఇలాంటి పెద్ద చిత్రంతో స్టార్‌కు జోడీగా నటించబోతోంది. హిరాని సినిమాల్లో హీరోయిన్లకూ మంచి పాత్రలుంటాయి. అవి బాగా ఎలివేట్ అవుతాయి. ఈ వార్త నిజమే అయితే మాత్రం తాప్సి మరో స్థాయికి వెళ్లబోతున్నట్లే.
This post was last modified on January 18, 2021 6:57 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…