తమిళంలో ఈ సంక్రాంతికి తక్కువ అంచనాల మధ్య విడుదలైన సినిమా ఈశ్వరన్. పండక్కి తమిళ ప్రేక్షకుల దృష్టంతా విజయ్ మూవీ మాస్టర్ మీదే ఉండటంతో.. ఈ చిత్రాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆకాశాన్నంటే అంచనాల మధ్య విడుదలవుతున్న మాస్టర్ ధాటికి శింబు సినిమా అసలు నిలవగలదా.. అది రేసు నుంచి తప్పుకుంటే మంచిదేమో అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.
ఐతే పల్నాడు, జయసూర్య లాంటి థ్రిల్లర్లతో ఆకట్టుకున్న సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈశ్వరన్‌పై చిత్ర బృందం నమ్మకం పెట్టింది. ధైర్యంగా సంక్రాంతి రేసులో ఈ చిత్రాన్ని నిలబెట్టింది. వారి నమ్మకానికి మంచి ఫలితమే దక్కింది.
మాస్టర్ ధాటికి పచ్చడైపోతుందేమో అనుకుంటే.. ఇప్పుడు మాస్టర్‌నే దెబ్బ కొడుతోంది ఈశ్వరన్. టాక్, రివ్యూల పరంగా మాస్టర్‌పై ఈ సినిమా స్పష్టమైన పైచేయి సాధించింది. రూరల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన సినిమా కావడంతో బి, సి సెంటర్లలో ఈశ్వరన్‌కు భారీ వసూళ్లు దక్కుతున్నాయి. సిటీల్లో కూడా బాగానే ఆడుతోందీ చిత్రం. 50 పర్సంట్ ఆక్యుపెన్సీ నేపథ్యంలో మొత్తం థియేటర్లను తమ సినిమాతోనే నింపేసి సోలోగా బాక్సాఫీస్‌ను దున్నుకుందామనుకున్న మాస్టర్ నిర్మాతలకు ఈశ్వరన్ ఝలక్ ఇచ్చింది.
ఈశ్వరన్ రూపంలో మంచి సినిమా కనిపిస్తుండటంతో జనాలు అటు మళ్లుతున్నారు. ప్రి రిలీజ్ హైప్ వల్ల తొలి వారాంతం వరకు మాస్టర్ మంచి వసూళ్లే సాధించినా.. ఆ తర్వాత సినిమా నిలబడ్డం కష్టంగా ఉంది. ఫుల్ రన్లో మాస్టర్ మీద ఈశ్వరన్‌దే పైచేయిగా కనిపిస్తోంది. ఈ చిత్రంతోనే ఇస్మార్ట్ శంకర్ భామ నిధి అగర్వాల్ తమిళంలో అడుగు పెట్టింది. ఆమెకు ఈ సినిమా అక్కడ శుభారంభాన్నే అందించింది. ఈశ్వరన్‌ను తెలుగులోనూ త్వరలో విడుదల చేయబోతున్నారు.
This post was last modified on January 18, 2021 7:34 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…