Movie News

సౌత్ ఈజ్ గ్రేట్.. బాయ్‌కాట్ బాలీవుడ్


బాలీవుడ్ ఇప్పుడు భారతీయ ప్రేక్షకులతో ఛీ కొట్టించుకుంటోంది. బాయ్‌కాట్ బాలీవుడ్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమం నడుస్తోంది ప్రస్తుతం. ఇందుక్కారణం.. పదే పదే బాలీవుడ్ సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో హిందూ దేవుళ్లను కించపరిచేు ప్రయత్నం జరుగుతుండటమే. ‘పీకే’ లాంటి ఆల్ టైం బ్లాక్‌బస్టర్ సహా చాలా సినిమాల్లో హిందూ దేవుళ్లను, హిందువుల మత ఆచారాలను తక్కువ చేసి చూపించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. తాజాగా అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘తాండవ్’ వెబ్ సిరీస్‌లో హిందూ దేవుళ్లను తమాషా చేసే ప్రయత్నం జరిగింది.

ఇంతకుముందు ‘పాతాళ్ లోక్’ సహా కొన్ని వెబ్ సిరీస్‌ల్లో ఇలాంటి సన్నివేశాలు కనిపించాయి. ఇక బాలీవుడ్ సినిమల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. వేరే మతాలకు చెందిన దేవుళ్లు, ఆచారాల గురించి ఏ చిన్న చర్చకు కూడా అవకాశం ఇవ్వని బాలీవుడ్ ఫిలిం మేకర్లు.. హిందూ దేవుళ్లు, మత ఆచారాలను మాత్రం అదే పనిగా కించపరచడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్నట్నుంచి ట్విట్టర్లో ‘బాయ్ కాట్ బాలీవుడ్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

‘పీకే’ మూవీ నుంచి ‘తాండవ్’ వెబ్ సిరీస్ వరకు హిందూ దేవుళ్లను తక్కువ చేసి చూపించిన సన్నివేశాల తాలూకు స్క్రీన్ షాట్లు పెట్టి బాలీవుడ్ ఫిలిం మేకర్లను దునుమాడుతున్నారు నెటిజన్లు. అదే సమయంలో సౌత్ సినిమాను, ఇక్కడి ఫిలిం మేకర్లను పొగుడుతుండటం విశేషం. దక్షిణాది సినిమాల్లో ఎప్పుడూ హిందూ దేవుళ్లను, హిందువుల మతాచారాలను గొప్పగా చూపిస్తుంటారని.. అదే సమయంలో వేరే మతాల్ని కించపరిచే ప్రయత్నం ఎప్పుడూ జరగదని పేర్కొంటూ ఇక్కడి సినిమాల తాలూకు స్క్రీన్ షాట్లను పెడుతున్నారు. ‘దువ్వాడ జగన్నాథం’ సహా పలు సినిమాల స్క్రీన్ షాట్లు కనిపిస్తున్నాయి. ఆ సినిమాలో అల్లు అర్జున్ సంప్రదాయ అవతారంలో కనిపిస్తాడన్న సంగతి తెలిసిందే.

This post was last modified on January 17, 2021 9:06 pm

Share

Recent Posts

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

4 hours ago

వైష్ణవి చైతన్య బాధ వర్ణనాతీతం

యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…

5 hours ago

మండాడి ఊపులో దేవర ఊసులు

తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…

5 hours ago

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

8 hours ago

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

8 hours ago