Movie News

వైష్ణవి చైతన్య బాధ వర్ణనాతీతం

యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం.. అందులో తనదే లీడ్ కావడం అసలు ఊహించలేని విషయం. వైష్ణవి చైతన్య కెరీర్లో ఈ అద్భుతమే జరిగింది. ‘సూర్య’ సహా కొన్ని వెబ్ సిరీస్‌లు.. ‘అల వైకుంఠపురములో’ సహా కొన్ని చిత్రాలు చేసిన ఆమెకు ‘బేబి’ లాంటి సెన్సేషనల్ మూవీలో నటించే అవకాశమొచ్చింది.

అందులో లీడ్ రోల్‌ను గొప్పగా పండించి ఆ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది వైష్ణవి. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిన్న సినిమా.. ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టి సంచలనం రేపింది. ఇంత పెద్ద హిట్టు కొట్టినందుకు ఏ హీరోయిన్ అయినా ఎంతో సంతోషిస్తుంది.
కానీ వైష్ణవి మాత్రం ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేయలేని పరిస్థితులు ఎదుర్కొంది.

ఈ చిత్రంలో ప్రేమించిన అబ్బాయిని మోసం చేసే పాత్రలో ఆమెను చూసి.. నిజంగానే తనను హేట్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. అంతే కాక వైష్ణవి స్థాయికి మించి సక్సెస్ వచ్చేసిందంటూ తక్కువ చేసి మాట్లాడడం.. తనకు యాటిట్యూడ్ అని కామెంట్లు చేయడం. ఫేక్ తెలంగాణ యాక్సెంట్ మాట్లాడుతోందని ట్రోల్ చేయడం.. ఇలా చాలానే చేశారు సోషల్ మీడియా జనాలు. ఇంకోవైపేమో తనకు లైఫ్ ఇచ్చిన ‘బేబి’ మేకర్స్ పట్ల కృతజ్ఞతగా లేదని, వారి తర్వాతి సినిమా నుంచి తప్పుకుందని.. ఆ రకంగానూ కొందరు ఆమెను టార్గెట్ చేశారు.

ఈ విషయాలన్నీ వైష్ణవిని బాగానే ప్రభావితం చేశాయట. ‘బేబి’ లాంటి పెద్ద సక్సెస్ వచ్చిందని సంతోషించాలో.. ఈ నెగెటివిటీని తలుచుకుని బాధ పడాలో తెలియని పరిస్థితిని తాను ఎదుర్కొన్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వైష్ణవి వెల్లడించింది. ఒక టైంలో తాను దీని వల్ల వేరే జోన్లోకి వెళ్లిపోయాని.. డిప్రెస్ అయిపోయానని ఆమె చెప్పింది. ఐతే ఇలా ఉండడం కరెక్ట్ కాదని తర్వాత తనకు తాను సర్దిచెప్పకున్నట్లు ఆమె తెలిపింది.

‘బేబి’లో పాత్రను అనుసరించి తనను ద్వేషిస్తున్నారంటే.. అంతగా ఆ పాత్ర జనాల్లోకి వెళ్లిందని, తాను అంత బాగా పెర్ఫామ్ చేశానని అర్థం కదా అనుకుని జనాల నెగెటివిటీని పాజిటివ్‌గా తీసుకునే ప్రయత్నం చేసినట్లు ఆమె వెల్లడించింది. ఓ తెలుగమ్మాయి తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడం, ఒక స్థాయి అందుకోవడం చిన్న విషయం కాదు. వైష్ణవి అలాంటి సక్సెస్ సాధిస్తే.. ఇలాంటి నెగెటివిటీతో ఇబ్బంది పడడం విచారకరం. ఆమె బాధను అర్థం చేసుకుని ఇప్పటికైనా తనపై సోషల్ మీడియా హేట్ క్యాంపైన్స్ ఆపేస్తే బెటర్.

This post was last modified on September 14, 2026 3:16 pm

Share

Recent Posts

మండాడి ఊపులో దేవర ఊసులు

తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…

23 minutes ago

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

3 hours ago

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

4 hours ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

4 hours ago

హైదరాబాద్ లో బాలికను రేప్ చేసిన 8 మంది

మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…

4 hours ago

జైలర్ 2 మీద పందెం కాసేదెవరు

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…

5 hours ago