Movie News

మండాడి ఊపులో దేవర ఊసులు

తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో రిస్క్ చేసే దర్శకులు అరుదు. ఉప్పెనలో బుచ్చిబాబు ఇది వాడుకున్నప్పటికీ రిస్క్ అనిపించే యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజులు, ఫైట్లు లేకుండా ఒక ప్రేమకథగా దాన్ని నడిపించారు. గతంలో చిరంజీవి ఆరాధన, జగపతిబాబు సముద్రం మొదలైనవి అంత లోతుగా వెళ్లిన సబ్జెక్టులు కావు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ దేవర వచ్చినప్పుడు స్పెషల్ అనిపించింది.

తాజాగా విడుదలైన మండాడి వల్ల దేవర ప్రస్తావన మరోసారి సోషల్ మీడియాలోకి వస్తోంది. వంద కోట్లలోపే బడ్జెట్ పెట్టుకుని దర్శకుడు మతిమారన్ పుగళేంది చూపించిన టేకింగ్ భాషతో సంబంధం లేకుండా ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా బోట్ రేసులు, క్లైమాక్స్ ఎపిసోడ్, సుడిగుండం నుంచి సూరి గ్యాంగ్ తప్పించుకునే సన్నివేశం ఒకదాన్ని మించి మరొకటి బెస్ట్ అనిపించుకున్నాయి. కొంత హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ జనం వాటిని అస్సలు పట్టించుకోవడం లేదు.

దీనికే ఇంత క్వాలిటీ కనిపించినప్పుడు వందల కోట్లతో తీసిన దేవరలో ఇంకెంత ఉండాలనేది జనాలు లేవనెత్తుతున్న ప్రశ్న. దర్శకుడు కొరటాల శివ మంచి అవుట్ ఫుట్ ఇచ్చినప్పటికీ కొన్ని సీన్స్ ని ఆశించిన స్థాయిలో తెరకెక్కించలేకపోయారనేది అప్పట్లో వచ్చిన కామెంట్. ఇంకా మెరుగ్గా ఉండాల్సిందని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మండాడి చూశాక అదంతా గుర్తు చేసుకుని సోషల్ మీడియా వేదికగా దేవర గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

తమిళంలో సముద్రం చుట్టూ తిరిగే కథలు కొత్త కాదు. అప్పుడెప్పుడో మూడు దశాబ్దాల క్రితమే చామంతి లాంటివి తీశారు ఆర్కె సెల్వమణి. తెలుగు డబ్బింగ్ కూడా హిట్టయ్యింది. ఇప్పుడు మండాడి పుణ్యమాని దర్శకులు రచయితలు మరోసారి సముద్రంని వాడుకునేలా ఉన్నారు. వంద కోట్ల వైపు పరుగులు పెడుతున్న ఈ వాటర్ థ్రిల్లర్ వల్ల సూరితో సమానంగా సుహాస్ కి పేరు వచ్చింది. కోలీవుడ్ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయని చెన్నై టాక్. ఇంకో రెండు మూడు క్లిక్ అయితే లైఫ్ సెటిలైనట్టే.  

This post was last modified on September 14, 2026 1:02 pm

Share

Recent Posts

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

3 hours ago

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

3 hours ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

4 hours ago

హైదరాబాద్ లో బాలికను రేప్ చేసిన 8 మంది

మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…

4 hours ago

జైలర్ 2 మీద పందెం కాసేదెవరు

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…

4 hours ago

నిర్మాత రిస్క్ చేశాడు… జాక్‌పాట్ కొడుతున్నాడు

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంత‌కుముందులా ఉదారంగా కొత్త సినిమాల‌ను కొన‌ట్లేద‌న్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌లు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫ‌ర్…

5 hours ago