కొన్ని సినిమాలు భాషతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఆడతాయని ధీమాగా చెప్పేయొచ్చు. ‘జెర్సీ’ అలాంటి సినిమానే. ఈ చిత్రం తెలుగులో మంచి విజయం సాధించింది. దీని కథాంశం సార్వజనీనమైంది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ స్టోరీ దేశంలో అన్ని భాషల వాళ్లకూ కనెక్ట్ అయ్యేదే.
నిజానికి తెలుగులో ఈ చిత్రం ఇంకా మంచి విజయం సాధించాల్సిందనే అభిప్రాయం ఉంది. గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన గొప్ప చిత్రాల్లో ‘జెర్సీ’ ఒకటి. దీన్ని హిందీలో పునర్నిర్మించబోతున్నారని సమాచారం బయటికొచ్చినపుడే ఇది అక్కడ కూడా మంచి విజయం సాధిస్తుందనే అభిప్రాయం కలిగింది. నిజానికి తెలుగు వెర్షన్ బాలీవుడ్ చిత్రాల స్టయిల్లోనే సాగుతుంది. ఆ తరహా నరేషన్ అక్కడి వాళ్లకు ఇంకా బాగా కనెక్ట్ అయ్యే అవకాశముంది.
ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌తో భారీ విజయాన్నందుకున్న షాహిద్ కపూర్ హీరోగా ‘జెర్సీ’ని హిందీలో రీమేక్ చేస్తుండటంతో ఇది స్యూర్ షాట్ హిట్ అనే అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు వెర్షన్‌ను రూపొందించిన గౌతమ్ తిన్ననూరినే హిందీ వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహిస్తుండగా.. నిర్మాణ సంస్థ సితా ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని హిందీకి తీసుకెళ్తున్నాడు. వీరికి కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత తోడయ్యాడు.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘జెర్సీ’కి రిలీజ్ డేట్ ఖరారు చేశారు. పోస్ట్ ప్రొడక్షన్‌కు బాగా టైం తీసుకుని, కరోనా ప్రభావం బాగా తగ్గే సమయానికి సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. దీపావళి కానుకగా నవంబరు 5న ‘జెర్సీ’ థియేటర్లలోకి దిగబోతోంది. ఈ చిత్రం ‘కబీర్’ సింగ్’ తరహాలోనే సంచనలాలు రేపడం ఖాయమనే ధీమా అందరిలోనూ ఉంది.
తెలుగులో శ్రద్ధ శ్రీనాథ్ చేసిన హీరోయిన్ క్యారెక్టర్‌ను హిందీలో మృణాల్ ఠాకూర్ చేస్తుండగా.. సత్యరాజ్ చేసిన కోచ్ పాత్రలో పంకజ్ కపూర్ నటించాడు. మరి హిందీలో ‘జెర్సీ’ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
This post was last modified on %s = human-readable time difference 3:52 pm
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…