ఆద‌ర్శ కుటుంబం డేట్ వేసినా… డౌటేనా?

త‌మ ప్రొడ‌క్ష‌న్లో వ‌స్తున్న ఆద‌ర్శ కుటుంబం సినిమా అక్టోబ‌రు 2న ప‌క్కాగా రిలీజ‌వుతుంద‌ని ఇటీవ‌లే నిర్మాత నాగ‌వంశీ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేశాడు. ఈ రోజు రిలీజ్ చేసిన టీజ‌ర్లోనూ రిలీజ్ డేట్ అక్టోబ‌రు 2 అనే పేర్కొన్నారు. అయినా స‌రే ఇటు ఇండ‌స్ట్రీలో, అటు మీడియాలో ఈ సినిమా విడుద‌ల తేదీ మీద ఊహాగానాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఆ రోజు సినిమా రాద‌నే అభిప్రాయం గ‌ట్టిగా వినిపిస్తోంది.

నాని సినిమా ది ప్యార‌డైజ్‌తో అసోసియేట్ అయి ఉన్న నాగ‌వంశీ.. ఆ సినిమాను అక్టోబ‌రు 2కు వాయిదా వేయ‌కుండా ఉండేందుకే ఆద‌ర్శ కుటుంబం అస‌లు రిలీజ్ డేట్ చెప్ప‌ట్లేద‌ని.. ఇప్పుడు ప్యార‌డైజ్‌ను 24న రిలీజ్ చేసేందుకు టీం ఫిక్స్ అయిపోయిన నేప‌థ్యంలో ఇంకొన్ని రోజుల త‌ర్వాత వెంకీ, త్రివిక్ర‌మ్ మూవీని వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టిస్తార‌ని ఒక చ‌ర్చ న‌డుస్తోంది టాలీవుడ్లో.

ది ప్యార‌డైజ్ ఈ నెల 24న వ‌స్తే ఆ సినిమాతో పాటు ఆద‌ర్శ కుటుంబం చిత్రానికీ మంచిద‌ని.. రెంటి మ‌ధ్య రెండు వారాల గ్యాప్ అవ‌స‌ర‌మ‌ని నాగ‌వంశీ అండ్ కో భావిస్తున్నార‌ట‌. పైకి అక్టోబ‌రు 2న రిలీజ్ అని చెబుతున్నా.. ఇండ‌స్ట్రీ జ‌నాల‌కు మాత్రం ఈ సినిమా 9న వ‌స్తుంద‌ని స‌మాచారం స్ప‌ష్టంగా తెలుస‌ని.. కొన్ని రోజుల్లోనే అంద‌రికీ ఈ విష‌యంపై క్లారిటీ వ‌స్తుంద‌ని చ‌ర్చించుకుంటున్నారు. 9న ఆద‌ర్శ కుటుంబం వ‌స్తే.. 16న వ‌చ్చే ద‌స‌రా సినిమాల నుంచి పోటీ ఉంటుంది. కానీ ద‌స‌రా సెల‌వుల్లో ఎక్కువ సినిమాలు బ‌రిలో ఉన్నా ఇబ్బంది ఉండ‌దు.

టాక్ బాగుంటే ఇది ఫ్యామిలీ మూవీ కాబ‌ట్టి సెల‌వుల్లో ఎక్స్‌టెండెడ్ ర‌న్ ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఒక‌వేళ ప్యార‌డైజ్ విష‌యంలో ఏదైనా తేడా జ‌రిగి వాయిదా అన్నారంటే మాత్రం అక్టోబ‌రు 2 నుంచి సినిమాను జ‌ర‌ప‌బోమని నాగ‌వంశీ ప‌ట్టుద‌ల‌కు వెళ్తాడ‌ని అంటున్నారు. ఆయ‌న‌కు ఈ రెండు చిత్రాల్లోనూ స్టేక్స్ ఉండ‌డంతో రెంటికీ మ‌ధ్య రెండు వారాల గ్యాప్ ఉండాల‌ని, రెండు చిత్రాలూ బాగా ఆడాల‌నే ఉద్దేశంతో ఇలా చేయ‌బోతున్నార‌ని స‌మాచారం.