టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ జయంతి, ఇద్దరు క్రిస్మస్, మళ్ళీ ఇద్దరు సంక్రాంతికి మహా సంగ్రామాన్ని రుచి చూపించబోతున్నారు. ఇలా ముప్పై నలభై సంవత్సరాల క్రితం జరిగింది కానీ కొత్త జనరేషన్ వీళ్ళ క్లాషులు చూడలేదు. అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం వస్తోంది. డిసెంబర్ 25 బాలకృష్ణ దాదా, నాగార్జున కింగ్ 100 నువ్వా నేనా అంటూ కవ్వించుకుంటుండగా సంక్రాంతికి చిరంజీవి కాకా, వెంకటేష్ జనవరి 12 విడుదల ఢీ కొంటున్నాయి.
ఈ అయిదింటిలో నాలుగు సినిమాల టీజర్లు వచ్చేశాయి. ముందుగా ‘దాదా’ సంగతి చూస్తే గ్యాంగ్ స్టర్ గా బాలయ్య ఫుల్ మాస్ అవతారంలో అభిమానులను మెప్పించినప్పటికీ ఓజి షేడ్స్ ఉండటం, డైలాగులు రొటీన్ గా అనిపించడం లాంటి కామెంట్స్ వినిపించాయి. ఎంత రెగ్యులర్ గా ఉన్నా సరైన మాస్ ఎపిసోడ్స్ పడితే గోపీచంద్ మలినేని మేజిక్ చేస్తాడని బలుపు, వీరసింహారెడ్డి లాంటి వాటితో గతంలో ఋజువయ్యింది. ఇక ‘కింగ్ 100’లో చాలా కాలం తర్వాత నాగార్జునని అల్ట్రా స్టయిలిష్ గా చూపించాడు ఆర్ కార్తీక్.
కొన్ని షాట్స్ కోసం ఏఐని వాడటం పట్ల కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా అసలు కంటెంట్ ఎక్కువ రివీల్ చేయకపోవడం వల్ల పూర్తి క్లారిటీ రాలేదు. దేవిశ్రీ ప్రసాద్ బిజిఎం మరోసారి పని చేస్తుందనే నమ్మకమైతే వచ్చింది. ఇక ‘కాకా’ సంగతి చూస్తే చిరంజీవి పాత్రని సాఫ్ట్ గా పరిచయం చేశారు తప్పించి కోల్కతా గెటప్ బయట పెట్టలేదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తాలూకు విజువల్స్ ని చూపించకుండా జస్ట్ పైపై మెరుగులు, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పని కానిచ్చేశారు. జస్ట్ ఓకే అనిపించుకుంది.
చివరిది అందరి కంటే ముందు వచ్చేది ‘ఆదర్శ కుటుంబం ఏకె 47’ టీజర్ ద్వారా త్రివిక్రమ్ శ్రీనివాస్ రిస్క్ లేని ఎంటర్ టైన్మెంట్ ఉంటుందనే హామీ అయితే ఇచ్చారు. అనిల్ రావిపూడి స్టయల్ ఫాలో అయ్యారని కొందరు కామెంట్ చేసినా మాటల మాంత్రికుడి మేజిక్ అంత ఈజీగా అంచనా వేయలేం. వెంకటేష్ మరోసారి దర్శనమిచ్చే జనవరి 12 విడుదల ప్రమోషన్లు మొదలయ్యాయి కానీ ఇంకా టీజర్ రాలేదు. ఇప్పటికైతే ఆరు పదుల వయసున్న నలుగురు సీనియర్ స్టార్లు టాలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పోటీకి తెర లేపడం చాలా బాగుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates