Movie News

త్రివిక్రమ్ మేజిక్ పని చేసినట్టేనా

ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ టైమింగ్ ని బాగా వాడుకున్నారని, శ్రీనిధి శెట్టి భర్తగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారని ప్రశంసలు కురిపిస్తున్నారు. మాటల మాంత్రికుడి ప్రాసలు కూడా ఉండటంతో వాటిని స్పెషల్ గా ఫీలవుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ అసలైన త్రివిక్రమ్ మేజిక్ ఇందులో కనిపించిందానే ప్రశ్న చాలా మంది మెదళ్లను తొలుస్తున్న మాట వాస్తవం.

దానికి పూర్తిగా ఔననే సమాధానం వినిపించడం లేదు. ఎందుకంటే టీజర్ ని చాలా తెలివిగా ఎక్కువ కథ రివీల్ కాకుండా కట్ చేశారు. ఈ క్రమంలో విలన్స్ ని చూపించడం కానీ, చిట్టిబాబు కుటుంబం ఎందుకు ప్రమాదంలో పడిందనేది బయట పడనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఇంకా ట్రయిలర్ ఉంటుంది కాబట్టి దానికోసం చాలా దాచారని అనుకోవాలి. అయితే అనిల్ రావిపూడి స్టయల్ లోకి త్రివిక్రమ్ వెళ్లినట్టు ఉందని కామెంట్ చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. కొందరు సపోర్ట్ కూడా చేస్తున్నారు.

గుంటూరు కారం తర్వాత ఇంత గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ నుంచి జనాలు హోల్ సేల్ గా ఎక్స్ ట్రాడినరి కంటెంట్ ఆశిస్తున్నారు. యావరేజ్ తో పనవ్వదు. అదిరిపోవాల్సిందే. ఇంకా చెప్పాలంటే అల వైకుంఠపురములో మాయాజాలాన్ని మళ్ళీ రిపీట్ చేయాలి. తమన్ ఆ స్థాయిలో పాటలు ఇవ్వాలి. ఇవన్నీ నిజంగా జరిగాయా లేదానేది రోజులు గడిచే కొద్దీ ఒక్కొకటిగా బయటికి వస్తాయి. మొత్తంగా స్టేట్ ఫస్ట్ వస్తారని భావించిన త్రివిక్రమ్ ప్రస్తుతానికి జిల్లా ఫస్ట్ దగ్గరే ఆగిపోయారు.

అక్టోబర్ 2 విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని టీజర్ లో మరోసారి క్లారిటీ ఇచ్చారు కానీ బయ్యర్ వర్గాలు మటుకు అక్టోబర్ 9 కు వెళ్తుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ప్యారడైజ్ కనక పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కనీసం మూడు వారాలు డామినేట్ చేస్తుంది కాబట్టి అప్పుడేమైనా నిర్ణయం మార్చుకుంటారేమో తెలియదు కానీ ఇప్పటికైతే నిర్మాత తేదీ మార్చుకునే ఉద్దేశంలో అయితే లేరట. పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ పనులు ఆఘమేఘాల మీద జరిగిపోతున్నాయి.

This post was last modified on September 12, 2026 10:48 pm

Share

Recent Posts

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

2 hours ago

ఒత్తిడి బండి మీద ‘రణబాలి’ ప్రయాణం

ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…

2 hours ago

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

3 hours ago

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

6 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

7 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

7 hours ago