Movie News

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం ఉండ‌డం గొప్ప విష‌యం. మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్, మ‌మ్ముట్టి మ‌ధ్య‌.. త‌మిళంలో ర‌జినీకాంత్, క‌మ‌ల్ హాస‌న్ మ‌ధ్య ఇలాంటి స్నేహ‌మే ఉంది. వీరి స్థాయిలో మ‌రీ థిక్ ఫ్రెండ్స్ అని చెప్ప‌లేం కానీ.. విజ‌య్, అజిత్ కూడా మంచి మిత్రులే. కాక‌పోతే ఇద్ద‌రూ బాగా ప్రైవేట్ ప‌ర్స‌న్స్ కాబ‌ట్టి వీరి ఫ్రెండ్షిప్ గురించి ఎక్కువ‌గా మీడియాలో హైలైట్ కాలేదంతే.

ఇప్పుడు విజ‌య్ సినిమాలు వ‌దిలేసి రాజ‌కీయాల్లోకి వెళ్లి ఏకంగా ముఖ్య‌మంత్రి అయిపోగా.. అజిత్ మాత్రం సినిమాల మీద కొంచెం ఫోక‌స్ త‌గ్గించాడు. ఆయ‌న‌కు మోటార్ స్పోర్ట్స్ అంటే మ‌హా ఇష్టం అన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా అజిత్ ఏడాదిలో చాలా రోజులు విదేశాల్లో గ‌డుపుతుంటాడు. ఇప్పుడు కూడా లండ‌న్‌లోని సిల్వ‌ర్‌స్టోన్‌లో రేసింగ్ కోసం వెళ్లాడు ఈ స్టార్ హీరో. అక్క‌డికి విజ‌య్ కూడా వెళ్ల‌డం.. అజిత్‌ను ఎంతో ఆత్మీయంగా క‌లుసుకోవ‌డం సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది.

ట్రాక్ ద‌గ్గర విజ‌య్ కోసం అజిత్ ఎదురు చూస్తుండ‌గా.. త‌న మిత్రుడిని చూడ‌గానే త‌మిళ‌నాడు సీఎం స్పందించిన తీరు హైలైట్. త‌న‌దైన శైలిలో డ్యాన్స్ చేసుకుంటూ అజిత్‌ను స‌మీపించిన అనంత‌రం.. విజ‌య్ ఆయ‌న్ని కౌగిలించుకున్నాడు. హ‌గ్ త‌ర్వాత ఆయ‌న్ని భుజం మీద ముద్దు కూడా పెట్టుకున్నాడు విజ‌య్. సీఎం అయినా.. ఆ హోదా చూపించ‌కుండా, అజిత్‌తో ఇంత స‌ర‌దాగా వ్య‌వ‌హ‌రించ‌డం అభిమానుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ సంద‌ర్భంగా అజిత్ కూడా విజ‌య్‌తో ఎంతో ఆత్మీయంగా వ్య‌వ‌హ‌రించాడు.

విజ‌య్ సీఎం అయిన కొన్ని రోజుల‌ త‌ర్వాత‌.. అజిత్ త‌ల్లి మ‌ర‌ణించ‌గా ఆ స‌మ‌యంలో త‌న మిత్రుడి ఇంటికి త్రిష‌తో క‌లిసి వెళ్లి ప‌రామ‌ర్శించి వ‌చ్చాడు విజ‌య్. అప్పుడు కూడా ఇద్ద‌రి మ‌ధ్య ఆత్మీయ‌త క‌నిపించింది. ఇప్పుడు ఈ ఇద్ద‌రూ ఎంతో హుషారుగా క‌లుసుకోవ‌డం ఇరువురి అభిమానుల‌ను ఎంతో ఆనందానికి గురి చేసింది. ఈ రోజుకు సోషల్ మీడియాలో ఇదే మేజ‌ర్ హైలైట్ అయింది. విజ‌య్, అజిత్ క‌లిసిన వీడియో కొన్ని నిమిషాల‌కే వైర‌ల్ అయిపోయింది.

This post was last modified on September 12, 2026 10:35 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

2 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

3 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

3 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

3 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

3 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

5 hours ago