బాగా ఆడుతున్న ‘క్రాక్’ సినిమాకు థియేటర్లు తగ్గించేశారని.. తాను డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ సినిమాకు పనికి రాని థియేటర్లను కేటాయించి, మంచి థియేటర్లను డబ్బింగ్ సినిమా అయిన ‘మాస్టర్’కు కేటాయించారని ఇటీవల డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ప్రధానంగా అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును లక్ష్యంగా చేసుకుని అతను ఆరోపణలు గుప్పించాడు. తాను నైజాం డిస్ట్రిబ్యూషన్లో పోటీగా మారుతున్నాననే కోపంతోనే రాజు ఉద్దేశపూర్వకంగా తన సినిమాల్ని చంపే ప్రయత్నం చేస్తున్నాడని అతను ఆరోపించాడు.
గతంలో డబ్బింగ్ సినిమాలకు వ్యతిరేకంగా మాట్లాడిన రాజు.. ఇప్పుడు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నాడని అతనన్నాడు. ఈ ఆరోపణలు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి. దీనిపై దిల్ రాజు ఏమంటాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఐతే రాజు మాట్లాడట్లేదు కానీ.. ఆయన తరఫున వేరే నిర్మాతలు ఒక్కొక్కరుగా లైన్లోకి వస్తున్నారు.
‘అల్లుడు అదుర్స్’ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి అయిన బెల్లంకొండ సురేష్.. రాజుకు మద్దతుగా మాట్లాడటం, శ్రీనును టార్గెట్ చేయడం తెలిసిందే. అలాగే ‘మాస్టర్’ నిర్మాత అయిన మహేష్ కోనేరు సైతం ఈ వివాదంపై స్పందించాడు. ప్రధానంగా తన చిత్రాన్ని శ్రీను టార్గెట్ చేసిన నేపథ్యంలో మహేష్ మాట్లాడాడు.
‘మాస్టర్’ పాన్ ఇండియా సినిమా అని.. ఇలాంటి సినిమాల్ని ఒక్కో చోట ఒక్కో తేదీకి విడుదల చేయడం సాధ్యపడదని, అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయాల్సి ఉంటుందని.. మన ‘బాహుబలి’ని అలా రిలీజ్ చేసినప్పుడు అన్ని భాషల డిస్ట్రిబ్యూటర్లూ సహకరించి థియేటర్లు ఇచ్చారని.. ‘కేజీఎఫ్’ విషయంలోనూ అలాగే జరిగిందని, రేప్పొద్దున ‘ఆర్ఆర్ఆర్’ విషయంలోనూ అలాగే ఉంటుందని.. ‘మాస్టర్’కు మనం కూడా అలాగే సహకరించాలని అతను అన్నాడు.
‘మాస్టర్’ అనువాద చిత్రమే అయినా.. దాని వల్ల డబ్బులు చూస్తోంది తాను, ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లే అని అతను చెప్పాడు. ‘క్రాక్’ సినిమాకు నైజాంలో 350 దాకా థియేటర్లు ఇచ్చాయని.. నాలుగు రోజుల పాటు ఆ సినిమా సోలోగా రన్ అయిందని.. తమ చిత్రానికి నైజాంలో దక్కింది 150 థియేటర్లే అని.. సంక్రాంతి రోజు ఇంకో రెండు సినిమాలు కూడా రావడంతో రెండో రోజుకు తన సినిమాకు సగం థియేటర్లు కోత విధించారని.. కానీ ‘క్రాక్’ అప్పుడు కూడా వందకు పైగా థియేటర్లలో కొనసాగిందని, దానికి థియేటర్లు తగ్గించలేదని.. ఇలా పండుగ సమయంలో అందరూ కలిసి థియేటర్లు పంచుకోక తప్పదని.. ఇందులో వివాదం చేయాల్సిన విషయం ఏమీ లేదని మహేష్ స్పష్టం చేశాడు.
This post was last modified on %s = human-readable time difference 3:52 pm
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…
నిన్న జరిగిన లక్కీ భాస్కర్ సక్సెస్ మీట్ లో నిర్మాత నాగవంశీని ఉద్దేశించి దిల్ రాజు ఒక మాటన్నారు. తనను…
నాలుగేళ్ల క్రితం 2021లో అల్లుడు అదుర్స్ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మళ్ళీ తెలుగు సినిమాలో కనిపించలేదు. అనవసరంగా బాలీవుడ్ మార్కెట్…
అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే పనయ్యే రోజులు కావివి. అలా చేయొచ్చనుకోవడమే అసలు కామెడీ. ఇటీవలే కన్నడ,…
హీరోయిన్లకు ఒక్కోసారి కెరీర్ లో స్పీడ్ బ్రేకర్ లాంటి దశ వస్తుంది. అప్పుడు ఎంత బ్లాక్ బస్టర్ సాధించినా అవకాశాలు…
పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలను అవమానిస్తుంటే చర్యలు తీసుకోరా?…