ఇంకో 15 రోజుల్లో విడుదల కాబోతున్న ది ప్యారడైజ్ టికెట్ రేట్లకు సంబంధించి ట్రేడ్ వర్గాల్లో చర్చలు మొదలైపోయాయి. పెంచాలా వద్దా అనే మీమాంసలో టీమ్ తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు మోడల్స్ ఉండటమే దీనికి కారణం. ముందుగా నైజామ్ చూస్తే మల్టీప్లెక్స్ గరిష్ట గోల్డ్ క్లాస్ ధర ప్రస్తుతం 295 రూపాయలు ఉంది. దీనికి ఇంకో యాభై అయిదు కలిపి మొత్తం 350 రూపాయలు చేస్తే ఎలా ఉంటుందనేది ఒక ప్రతిపాదన. బుకింగ్ చార్జీలు అదనం.
ఒకవేళ ఇలా చేసే పనైతే సింగల్ స్క్రీన్లకు పెంచకుండా ఆల్రెడీ అమలులో ఉన్న 200 రూపాయల రేటులో కంటిన్యూ కావొచ్చు. కాకపోతే ఇక్కడో రిస్క్ ఉంది. తెలంగాణ ప్రభుత్వ నిబంధన ప్రకారం ధరల హైక్స్ కావాలంటే కోటి రూపాయల వెల్ఫేర్ ఫండ్ డిపాజిట్ చేయాలి. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇబ్బంది లేదు. రికవరీ వేగంగా ఉంటుంది. నిర్మాత పెంచకుండా వెళ్తే ఎలా ఉంటుందనే కోణంలో ఆలోచిస్తూ ఉండగా బయ్యర్లు మాత్రం యాభై లేదా డెబ్భై అయిదు రూపాయల పెంపు వైపు మొగ్గు చూపుతున్నారట.
ఇక ఏపీ పరిస్థితి చూస్తే అక్కడ మల్టీప్లెక్స్ గోల్డ్ క్లాస్ గరిష్ట ధర 177 రూపాయలు. సింగల్ స్క్రీన్ 100 నుంచి 110 రూపాయల మధ్యలో ఉంది. ఇక్కడ పెంపు తప్పకపోవచ్చని డిస్ట్రిబ్యూషన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎంత అడిగినా నో చెప్పదు కాబట్టి ముందు డిసైడ్ చేయాల్సింది ప్రొడ్యూసర్లే. టాక్సిక్ కు పాటించిన స్ట్రాటజీ రెండువైపులా బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. కానీ ప్యారడైజ్ కున్న పాజిటివ్ వైబ్స్ వల్ల భయపడాల్సిన పని లేదు.
చివరి నిమిషం దాకా హడావిడి చేసి ఒత్తిడి కొని తెచ్చుకోకుండా కనీసం వారం ముందరే హైక్స్ మ్యాటర్ తేల్చి బుకింగ్స్ త్వరగా మొదలుపెట్టే యోచనలో ఉన్నట్టు తెలిసింది. జూన్ నుంచి పెద్ది, టాక్సిక్ తప్ప ఏ సినిమా పెంపులకు పోలేదు. అన్నీ సూపర్ హిట్లు కొట్టాయి. ముఖ్యంగా ఇరుముడి చేసిన వసూళ్ల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. సో ప్యారడైజ్ కు బాగుందనే మాట వస్తే చాలు కలెక్షన్ల ఊచకోతని ఊహించడం కష్టం. నానితో సహా పని చేసినవాళ్లందరి నమ్మకం ఆ రేంజులో ఉంది.
This post was last modified on September 9, 2026 7:30 pm
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లెర్నర్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు స్లాట్ బుక్…
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఏదైనా పని జరగాలి, మెసేజ్ జనానికి చేరాలి అంటే.. దీని ద్వారా…
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి విడుదలైన నారాయణమ్మ పాట సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీస్తోంది.…
ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చేసిన సూచన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉద్యోగం…
ఈ రోజుల్లో మంచి పని చేయడం ఎంత ముఖ్యమో...ఆ పనిపై జరిగే విషప్రచారాన్ని ఖండించడం కూడా అంతే ముఖ్యం. మరీ…
రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ చూడటం చాలామందికి అలవాటుగా మారిపోయింది. గదిలో లైట్లు ఆపేసిన తర్వాత కూడా మొబైల్ స్క్రీన్…