థియేటర్లు పున:ప్రారంభం అయితే అయ్యాయి కానీ.. ఇంకా పెద్ద సినిమాలను ఇప్పుడే విడుదల చేయడానికి నిర్మాతలకు ధైర్యం చాలడం లేదు. ఇంకా కరోనా ప్రభావం కొనసాగుతుండటం, థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తుండటంతో ఇలాంటి సమయంలో రిలీజ్ చేసి రెవెన్యూను ఎందుకు తగ్గించుకోవడం అని చూస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం.. ఇలా అన్ని భాషల్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అన్ని చోట్లా మీడియం రేంజ్ సినిమాలనే నడిపిస్తూ వచ్చారు తప్ప పెద్ద సినిమాలు మాత్రం రేసులోకి రాలేదు.
కానీ ఒక్క తమిళంలో మాత్రం సంక్రాంతికి ‘మాస్టర్’ లాంటి భారీ చిత్రాన్ని ధైర్యం చేసి రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని కూడా 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిచినపుడే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ తమిళనాట డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వచ్చి వేడుకోవడంతో ‘మాస్టర్’ టీం సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసేసింది.
ఐతే ఈ సినిమాకు ఆశించిన టాక్ అయితే రాలేదు. తమిళంలోనే కాక మిగతా భాషల్లోనూ ‘మాస్టర్’ పట్ల మిశ్రమ స్పందనే వ్యక్తమైంది. ఐతే టాక్ ఇలా ఉన్నా.. థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తున్నా.. ‘మాస్టర్’ బాక్సాఫీస్ దగ్గర గట్టి ప్రభావంమే చూపుతోంది. ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజు.. ఆ తర్వాతి రోజుల్లో కూడా వసూళ్ల జోరు కొనసాగుతోంది. ఆదివారం వరకు ఈ ఊపు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఒక్క తమిళనాడులోనే ‘మాస్టర్’ ఇప్పటిదాకా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. తెలుగులోనూ ఈ చిత్రం బాగా ఆడుతోంది. ఇక్కడ రూ.15 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ అయింది. ఇండియాలోని మిగతా రాష్ట్రాలు, ఓవర్సీస్.. అన్ని వసూళ్లను కలిపితే ‘మాస్టర్’ రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసినట్లు ట్రేడ్ పండిట్లు చెబున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత వేగంగా రూ.100 కోట్ల గ్రాస్ అంటే విజయ్ స్టార్ డమ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on January 16, 2021 9:18 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…