Movie News

అన్న రాలేదు.. వదినమ్మ ఒక్కరే ఎందుకు?

విజయ్ దేవరకొండ.. తమ్ముడి కెరీర్ మొదట్లో సినిమాలకు తనవంతు పుష్ ఇచ్చాడు. కానీ ఆనంద్‌కు సొంతంగా పేరు రావడం మొదలయ్యాక ప్రతి సినిమా దగ్గర విజయ్ కనిపించే పరిస్థితి లేదు. అన్న ఎప్పుడూ పక్కనే ఉంటే ఓవర్ షాడో ఎక్కువయ్యే అవకాశం లేకపోలేదు. ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ ట్రైలర్ లాంచ్‌లో విజయ్ లేకపోవడం అందుకే పెద్ద ఆశ్చర్యం కాదు.

కానీ అక్కడ రష్మిక కనిపించడం మాత్రం వెంటనే నోటీస్ అయింది. పెళ్లి తర్వాత ఆనంద్ సినిమా వేడుకకు వదినగా ఆమె రావడం ఇదే మొదటిసారి. పైగా కొన్ని నెలల కిందట ‘ఎపిక్’ టీజర్ లాంచ్‌లోనే ట్రైలర్ ఈవెంట్‌కు వదినమ్మను పిలుస్తానని ఆనంద్ సరదాగా చెప్పాడు. అప్పట్లో చెప్పిన మాట ఇప్పుడు నిజంగానే స్టేజ్ వరకు వచ్చింది.

ఇక్కడ ఇంకో లెక్క కూడా ఉంది. విజయ్, రష్మిక ఇద్దరూ కలిసి వచ్చి ఉంటే ఈవెంట్ టోన్ మొత్తం మారిపోయేది. పెళ్లి తర్వాత ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే మీడియా ఫోకస్ వాళ్ల మీదకే వెళ్లేది. ట్రైలర్ ఎలా ఉంది, ఆనంద్ ఏం మాట్లాడాడు, వైష్ణవి ఏం చెప్పింది అన్నదానికంటే దేవరకొండ ఫ్యామిలీ ఫొటోలే ఎక్కువగా తిరిగేవి. ఒక్క రష్మిక రావడంతో ఆ హంగామా అంతగా రాలేదు.

ఆనంద్‌కు ఇప్పుడు అన్న పుష్ తప్పనిసరి కూడా కాదు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో గుర్తింపు వచ్చింది. ‘బేబీ’తో వంద కోట్ల సినిమా కూడా చూశాడు. ఇప్పుడు ‘ఎపిక్’కు తన కాంబినేషన్, దర్శకుడు ఆదిత్య హాసన్, ‘బేబీ’ తర్వాత వైష్ణవితో మళ్లీ జోడీ అన్న పాయింట్లు ఉన్నాయి. ఇలాంటి టైమ్‌లో ప్రతి ఈవెంట్‌కు విజయ్ రావడం ఆనంద్‌కే ఓవర్ కేరింగ్‌లా కనిపించే ఛాన్స్ ఉంటుంది.

ఇక ఆనంద్‌తో ఉన్న ఫ్యామిలీ బాండింగ్, ముందే ఇచ్చిన మాట ఇవే ఆమె రాకకు సరిపోయే కారణాలు. ఇక ‘రణబలి’ ప్రమోషన్స్ మొదలైతే విజయ్, రష్మిక కలిసి కనిపించే సందర్భాలు ఎలాగూ వస్తాయి. అప్పుడు ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో ఉంటే ఆ బజ్ వేరు. పెళ్లి తరువాత మొదటిసారి ఒక వేడుకలో పాల్గొంటే మళ్ళీ ట్రెండింగ్ లోకి వస్తారు. అందుకే ‘ఎపిక్’ స్టేజ్‌ను కూడా అన్న, వదిన జంట షోగా మార్చకుండా ఉండటం బెటర్ అయింది.

This post was last modified on September 5, 2026 3:16 pm

Share

Recent Posts

ఉన్న కాస్త సింపతీ పోతుంది జగన్

ఒక పార్టీపై చ‌ర్య‌లు తీసుకున్నా.. ఒక పార్టీ నాయ‌కుడిపై చ‌ర్య‌లు తీసుకున్నా.. స‌హ‌జంగానే ప్ర‌జ‌ల్లో అంతో ఇంతో సింప‌తీ ద‌క్కుతుంది.…

18 minutes ago

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ రాజ‌కీయం మామూలుగా లేదే.. !

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజ‌కీయాలు కూట‌మిలోనే అంత‌ర్గ‌త వివాదాల‌కు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం పూర్తిగా ప‌ట్ట‌ణ ప‌రిధిలో ఉంది.…

2 hours ago

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

6 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

11 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

13 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

13 hours ago