Movie News

మహాకాళి ముందు జాగ్రత్త పడుతోంది

హనుమాన్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ నిర్మాణంలో మహాకాళి రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా అందరికంటే ముందు జనవరి 8 విడుదల ఆల్రెడీ లాక్ చేసుకున్నారు. పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా సరే వెనక్కు తగ్గకుండా పక్కా ప్లానింగ్ తో పనులన్నీ పూర్తి చేస్తున్నారు. పూజ కొల్లూరి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ విజువల్ ఫాంటసీ డ్రామాలో భూమి శెట్టి టైటిల్ రోల్ పోషిస్తుండగా దురంధర్ ఫేమ్ అక్షయ్ ఖన్నా శుక్రాచార్యగా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశారు.

మార్కెటింగ్ విషయంలో మహాకాళి చాలా ముందు జాగ్రత్త పడుతోంది. జనంలో తమ సినిమా గురించి నిత్యం కనెక్టివిటీ ఉండేలా ప్రచార పర్వాన్ని ఇప్పటి నుంచే మొదలుపెట్టింది. తాజాగా విడుదలైన మీర్జాపూర్ తో పాటు కొత్త టీజర్ ని అటాచ్ చేయడం ద్వారా త్వరగా ఆడియన్స్ ని చేరుకునే స్ట్రాటజీని పాటిస్తోంది. హిందీ తెలుగు వెర్షన్ దేశంలో ఎక్కడా రన్ అవుతున్నా వాటన్నటిలోనూ మహాకాళి దర్శనం జరుగుతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది.

శుక్రాచార్యుడి విజువల్స్ తో పాటు అమ్మవారిగా శ్రేయారెడ్డిని చూపించిన విధానం ఆల్రెడీ మాస్ జనాల్లోకి బాగా వెళ్ళింది. క్రమంగా అంచనాలు పెంచేందుకు వేసిన మొదటి అడుగు సక్సెస్ అయినట్టే. ఇంకా అసలు హీరోయిన్ ని రివీల్ చేయలేదు. ఇతర ఆర్టిస్టులను చూపించలేదు. ఒకపక్క జై హనుమాన్ షూటింగ్ లో తాను ఎంత బిజీగా ఉన్నా మహాకాళి ప్రమోషన్ల విషయంలో ప్రశాంత్ వర్మ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. హనుమాన్ టైంలో మిస్ చేసిన సపోర్ట్ ఈసారి పూర్తిగా దక్కనుంది.

ఇక పోటీ విషయానికి వస్తే మహాకాళి ముందే రావడం ఎంత ప్లస్ అయినా తర్వాత రిలీజయ్యేవి చాలా టఫ్ కాంపిటేషన్ ఇచ్చేలా ఉన్నాయి. వెంకటేష్ జనవరి 12 విడుదల, చిరంజీవి కాకా, శర్వానంద్ జార్జ్ క్రిష్, రజనీకాంత్ ధర్మన్, శ్రీవిష్ణు – రాంఅబ్బరాజు కాంబో, సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు క్యూ కట్టి ఉన్నాయి. వీటిని తట్టుకుని మహాకాళి నిలబడాలంటే యునానిమస్ కంటెంట్ ఉండాల్సిందే. దానికి అనుగుణంగానే పబ్లిసిటీ విషయంలోనూ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

This post was last modified on September 5, 2026 7:52 am

Share

Recent Posts

పెళ్లి కోసం 12 గంటల పెరోల్

పెళ్లంటే నూరేళ్ళ పంట అనేది పాత సినిమాలో హిట్టయిన పాట. హరియాణాకు చెందిన గ్యాంగ్ స్టర్ మైనపాల్ ఢిల్లా మాత్రం…

18 minutes ago

గొప్పలకి పోయి రీల్స్ చేస్తే డబ్బంతా దొంగల పాలయ్యింది

సోష‌ల్ మీడియాలో వ్యూస్ కోసం చేసే రీల్స్ ప్రాణాల మీద‌కు తెస్తున్న విష‌యం తెలిసిందే. రైలు ప‌ట్టాల‌పై ప‌డుకుని, కూర్చుని…

2 hours ago

ప్రియదర్శికి కలిగిన ప్రయోజనం ఎక్కువే

టాలెంట్ లోటు లేకపోయినా కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల ప్రియదర్శి కెరీర్ రెండు హిట్లు నాలుగు ఫ్లాఫుల్లా సాగిపోతోంది.…

10 hours ago

నాయకులు చెబుతున్నా నేతలు కదలడం లేదు

త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశించి టీడీపీ అధినేత‌, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు సీరియ‌స్‌గా ఉన్న…

10 hours ago

జైలర్ 2 కోసం రెండో నెంబర్ అలెర్ట్

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ 2 మీద అంచనాలు ఏ స్థాయిలో…

10 hours ago

ధనుష్ నుంచి ఇది నేర్చుకోవచ్చు

స్టార్ హీరోలకు వేగం అవసరం. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి వాళ్ళు ఏడాదికి పది నుంచి పదిహేను సినిమాలు…

11 hours ago