‘వకీల్ సాబ్’ టీజర్ వస్తుందంటే కోర్టులో పవన్ వాదించే సీన్లు, హీరోయిన్లను వేధించే సన్నివేశాలకు సంబంధించిన సీన్లు వుంటాయని అనుకున్న వాళ్లకు టీజర్‍తో షాక్ తగిలింది. అసలు ‘పింక్’ను గుర్తు చేసే షాట్ ఒక్కటి కూడా లేకుండా పూర్తిగా పవన్ కళ్యాణ్‍ని మాత్రమే చూపించారు. ఇందులో మూడు, నాలుగు ఫైట్లు కూడా వుంటాయని తేల్చేసారు. శృతిహాసన్‍తో కలిసి పవన్ బైక్‍లో వెళుతోన్న పోస్టర్‍తో ఫ్లాష్‍బ్యాక్ కూడా బలంగానే వుంటుందని చూపించారు.
ఈ మార్పులు పవన్ క్యారెక్టర్ వరకే కాదు… ఇంకా ఎన్నో మార్పులు కూడా దర్శకుడు శ్రీరామ్ వేణు చేసాడట. పింక్‍లో హీరోయిన్ల నేపథ్యం ఏమీ చూపించరు. కానీ ఈ సినిమాలో మాత్రం అమ్మాయిలు అందరికీ ఒక నేపథ్యం, వాళ్ల స్థితిగతులు చూపిస్తారట. దాని వల్ల ఆ అమ్మాయిలు ఇలాంటి కేసులో ఇరుక్కున్నపుడు వాళ్ల ఇళ్లల్లో పెద్దవాళ్లు పడే మనోవేదన ఎలా వుంటుందనేది కూడా చూపించి ఎమోషనల్ డెప్త్ పెంచారట.
అమ్మాయిల తరఫున వాళ్ల తల్లిదండ్రులు కూడా మాట్లాడకపోతే వారి వైపు పవన్ మాట్లాడడం, అలా పేరెంట్స్లో కనువిప్పు తేవడం లాంటి సీన్లు బాగా పండాయట. పింక్ అనే కథను పవన్‍కళ్యాణ్ లాంటి సూపర్‍స్టార్ చేస్తే ఎలా వుండాలో ఆ విధంగా దర్శకుడు మార్చేసాడని, అందుకే ఒరిజినల్ చూసిన వాళ్లకు కూడా ఇది కొత్తగా అనిపించేలా వుంటుందని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంపౌండ్‍లో వేణుని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
This post was last modified on January 15, 2021 11:52 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…