Movie News

సంక్రాంతి థియేటర్ల కోసం యుద్ధాలు చేయాలేమో

ఇంకా నాలుగు నెలలు ఉండగానే 2027 సంక్రాంతి గురించి ఇండస్ట్రీ వర్గాలు, డిస్ట్రిబ్యూటర్లలో విపరీతమైన చర్చలు మొదలయ్యాయి. నేనంటే నేనంటూ ఒక్కొక్కరు పండక్కు రావాలని పంతం పూనడంతో అసలు అన్ని థియేటర్లు ఎలా సరిపోతాయనే ఆందోళన నిర్మాతల్లో మొదలయ్యింది. ఈ కారణంగానే శర్వానంద్ నారి నారి నడుమ మురారికి మంచి టాక్ వచ్చినా భారీ రెవిన్యూ తేలేకపోయింది. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓపెనింగ్స్ కోసం పోరాడాల్సి వచ్చింది.  

రాబోయే పండక్కు వెంకటేష్ కళ్యాణ్ రామ్ ‘జనవరి 12 విడుదల’ ఎలాంటి మార్పు లేకుండా చెప్పిన తేదీకే వచ్చి తీరుతుంది. అనిల్ రావిపూడి రాజీ పడే సమస్యే ఉండదు. చిరంజీవి ‘కాకా’ ఆ మరుసటి రోజు వచ్చేస్తుంది. దర్శకుడు బాబీ కొల్లి పక్కా హామీ ఇవ్వడంతో కెవిఎన్ సంస్థ టీజర్ లోనే డేట్ చెప్పేసింది. వీటికన్నా ముందు ప్రశాంత్ వర్మ నిర్మాతగా రూపొందిన ‘మహాకాళి’ జనవరి 8 రానుండగా, సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ జనవరి 12 దిగుతున్నట్టు అనౌన్స్ మెంట్ ఇచ్చింది.

శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ జనవరి 14 అని పూజా కార్యక్రమాల రోజే చెప్పేసింది. అదే రోజు రవితేజ శ్రీవిష్ణు కాంబోతో హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందే ‘దాగుడుమూతల దండాకోర్ (ప్రచారంలో ఉన్న టైటిల్)’ కూడా రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు ప్రాధమికంగా నిర్ణయించుకున్నారట. రజినీకాంత్ ‘ధర్మన్’ పొంగల్ బరిలో దింపితే వచ్చే భారీ లాభాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాత కమల్ హాసన్ ఇంకొద్ది రోజుల్లో దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.

ఎంత సంక్రాంతి సీజన్ కీలకమే అయినా మరీ ఇలా ఏడెనిమిది సినిమాలు క్యూ కడితే చాలా కష్టం. ఎందుకంటే అయిదారు స్క్రీన్లు మాత్రమే ఉండే బిసి సెంటర్లు ఏపీ తెలంగాణలో చాలా ఉన్నాయి. వాటిలో ఇవన్నీ సర్దుబాటు చేయడం కష్టం. అందులోనూ దాదాపు అన్నీ కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్లే. ఒకటి రెండు సీరియస్ జానర్ ఉన్నప్పటికీ వరల్డ్ బిల్డింగ్ కాన్సెప్ట్ కాబట్టి జనాల్లో హైప్ తీసుకు రావొచ్చు. చూడాలి మరి ఎవరెవరు మాట మీద ఉంటారో ఎవరెవరు తప్పుకుంటారో. 

This post was last modified on August 26, 2026 10:48 pm

Share

Recent Posts

సీఎం రేవంత్ విభేదాలు… సాయంత్రానికి సర్దుబాటు

తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో రోజుకో నాయకుడు ఏదోకటి మాట్లాడుతూ మీడియాకు చేతినిండా పని పెడుతున్నారు. ఒకరోజు కొండా సురేఖ, మరో…

3 hours ago

ప్యారడైజ్ టికెట్ రేట్లకు ఏ స్ట్రాటజీ మంచిది

కేవలం తొమ్మిది రోజుల్లో ది ప్యారడైజ్ థియేటర్లలో అడుగు పెట్టనుంది. విపరీతమైన అంచనాలతో పాటు ఒత్తిడి కూడా అదే స్థాయిలో…

3 hours ago

అల్లు అర్జున్ మామపై కేసు

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైన వైనం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్…

5 hours ago

ఎంఎస్ సుబ్బులక్ష్మి… వాళ్ళిద్దరికీ పెద్ద ఛాలెంజ్

రేపు ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ఓపెనింగ్ జరగనుంది. అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న…

6 hours ago

మనోళ్లకు మండాడి అంతెందుకు నచ్చింది

నిన్నటి తమిళ కమెడియన్ ఇప్పటి హీరో సూరి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరుగుతూ ఆశ్చర్యానికి గురవుతున్నాడు. కారణం ప్రతి చోటా…

7 hours ago

వాస్తవంలోకి రావయ్యా విశాల్

గత నెల మకుటం అనే సినిమా విడుదలయ్యిందనే సంగతి హార్డ్ కోర్ మూవీ ఫాలోయర్స్ కి తప్ప సామాన్య ప్రేక్షకులకు…

9 hours ago