ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్ ని పెద్ది గురించి చర్చించుకునేలా చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ అయిన రామ్ చరణ్ మూవీ ఓవర్ సీస్ తో సహా ఇతర ప్రాంతాల్లో ప్యాన్ ఇండియా ఫ్లాప్ అయ్యిందనేది వాస్తవం. హిందీలో అన్ని ప్రమోషన్లు చేసినా లాభం లేకపోయింది. చరణ్ కష్టానికి తగ్గ పూర్తి ప్రతిఫలం దక్కలేదనే అసంతృప్తి మెగాభిమానుల్లో చాలా ఉందనేది వాస్తవం.
ఎందుకీ పోలిక వచ్చిందో చూద్దాం. పెద్దిని ప్రధానంగా దెబ్బ కొట్టింది సెకండాఫ్. ముఖ్యంగా చివరి గంటంపావు స్పోర్ట్స్ డ్రామా మరీ బరువెక్కిపోవడంతో ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. రామ్ చరణ్ లాంటి టయర్ 1 స్టార్ ని పదే పదే కష్టాల్లో చూపిస్తూ, ఫైట్లు లేకుండా, ఎలివేషన్లు రాకుండా, ఏడిపించడమే లక్ష్యంగా పెట్టుకుంటే ఫ్యాన్స్ కి కూడా నచ్చదు. అందుకే హైలైట్ అవుతుందని ప్రచారం జరిగిన ఢిల్లీ ఎపిసోడ్ పెద్దగా సౌండ్ చేయకుండానే తేలిపోయింది. మెయిన్ మైనస్ అయ్యింది.
ఇరుముడిలో అలా ఉండదు. ముత్యాల పల్లకి లాంటి హుషారైన దేవుడి పాట అయిపోయిన వెంటనే గూస్ బంప్స్ ఇచ్చే ఆటో ఛేజ్ ఉంటుంది. అందులో రవితేజ ఫైట్లు ఓ రేంజ్ లో పేలాయి. కూతురికి సంబంధించి మెయిన్ ట్విస్ట్ రివీలయ్యాక ఎక్కువసేపు సాగతీత లేకుండా మాస్ మహారాజ యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోయి మాస్ ని టార్గెట్ చేసుకుంటాడు. ఇలా క్రమం తప్పకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ వస్తూనే ఉండటం వల్ల అన్నీ బ్యాలన్స్ అయిపోయాయి.
కానీ పెద్దిలో ఇది సరిగ్గా కుదరకపోవడం వల్లే ఫైనల్ రిజల్ట్ కొంచెం తేడా కొట్టేసింది. అవి సరిగ్గా కుదిరి ఉంటే భారీ రికార్డులు కొల్లగొట్టేదన్న మాటలో అబద్దం లేదు. ఇకపై శరీర భాగాలను త్యాగం చేయడం లాంటివి లేకుండా ప్రాపర్ మాస్ మూవీ తీస్తాడని బుచ్చిబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అది చిరంజీవితోనా లేక మహేష్ బాబుని ట్రై చేస్తున్నాడా అనేది ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతానికి కథలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారని టాక్. క్లారిటీ రావడానికి టైం పట్టేలా ఉంది.
This post was last modified on August 24, 2026 11:14 am
కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి చాలా లో ప్రొఫైల్ మెయింటెన్…
యాంకర్ సుమ అంటే వినోదానికి కేరాఫ్ అడ్రస్. ఆమె మైక్ అందుకుందంటే నవ్వులే నవ్వులు. ఆమె ఎమోషనల్ అవడం, కన్నీళ్లు…
తన మేనకోడలు అంజిలి వివాహాన్ని తన ఉమ్మడి ఆస్తి కాంపౌండ్ లో జరపకూడదని మేనమామ జగన్ అడ్డుపడుతున్నారని విమర్శలు వస్తున్న…
ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో విధ్వంసం సృష్టించేందుకు ఏపీ మాజీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.…
టీమ్ఇండియాకు మరోసారి బ్యాటర్లే విజయాన్ని అందించారు. న్యూజిలాండ్‌తో రెండో టీ20లో 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఒక…
ఇప్పటిదాకా త్రివిక్రమ్ శ్రీనివాస్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, యాక్షన్ సినిమాలే తీశాడు. తన సమకాలీన దర్శకులు, తనకంటే జూనియర్లు…