Movie News

బాలయ్య 111… రెండక్షరాల టైటిల్స్ రెడీ ?

నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారం. మొదటిది ‘గాడ్’ కాగా రెండోది ‘దాదా’ అని చర్చిస్తున్నట్టు తెలిసింది. వీటిలో ఏది బాగుంటుందనేది బాలయ్యతో డిస్కస్ చేశాక ప్రకటించబోతున్నారు. వచ్చే నెల నుంచి షూటింగ్ రీ స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 24 రిలీజ్ డేట్ ఆల్రెడీ లీకైన సంగతి తెలిసిందే.

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు రెండక్షరాల టైటిల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. పవన్ కళ్యాణ్ కు ‘ఓజి’ ఎంత పెద్ద హిట్టు ఇచ్చిందో తెలిసిందే. పొడవుగా ఉన్న హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ రెండూ దెబ్బ తిన్నాయి. అల్లు అర్జున్ ఆల్రెడీ ‘రాకా’ని ఫిక్స్ చేసుకోగా చిరంజీవి ఇటీవలే ‘కాకా’ని అనౌన్స్ చేసి టీజర్ కూడా వదిలేశారు. ఈ ఫ్లోలో బాలయ్య కూడా ‘గాడ్’ లేదా ‘దాదా’గా రావడం మంచిదే. క్యాచీగా ఉండటంతో పాటు ఇలాంటి పేర్లు జనంలోకి త్వరగా వెళ్తాయి.

ఇప్పుడు అనుకున్న ప్రకారం విడుదల తేదీకి ఇంకో మూడున్నర నెలలు మాత్రమే ఉండటంతో గోపిచంద్ మలినేని చాలా పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్ళబోతున్నారు. ఆర్టిస్టుల డేట్లను మళ్ళీ షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. బాంబే బ్యాక్ డ్రాప్ లో బాలయ్య మాఫియా డాన్ గా కనిపిస్తారని ఇన్ సైడ్ టాక్. ఇందులోనూ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉన్నప్పటికీ రెగ్యులర్ బాషా ఫార్ములాతో కాకుండా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారని యూనిట్ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

గత ఏడాది అఖండ 2 ఆశించిన విజయం అందుకోలేకపోయిన నేపథ్యంలో నందమూరి అభిమానులు ఎన్బికె 111 మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. అఖండ నుంచి డాకు మహారాజ్ వరకు సక్సెస్ లతో దూసుకుపోయిన బాలయ్యకు అదొక్కటే స్పీడ్ బ్రేకర్ అయ్యింది. నెక్స్ట్ కొరటాల శివతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఓపెనింగ్ పూజ అయిపోయింది. ఈ ప్రాజెక్టు ఉంటుందో లేదోనని పుకార్లు ఈ మధ్య మొదలవ్వగా అలాంటిదేమి లేదని టీమ్ క్లారిటీ ఇచ్చి వాటికి బ్రేక్ వేసింది.   

This post was last modified on August 24, 2026 12:32 pm

Share

Recent Posts

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

26 minutes ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

2 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

3 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

4 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

4 hours ago

ట్రైలర్ లేకుండా సినిమా… వాటి రిజల్ట్ తెలుసా?

నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…

5 hours ago