Movie News

రవితేజ పోటీని యష్ తట్టుకోవాలంటే

ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి తీసి మరీ సర్దాల్సి వస్తోంది. అయినా సరే తక్కువ స్క్రీన్లు ఉన్న బిసి సెంటర్ల లో ఈ సమస్య తీవ్రంగానే ఉంది. ఇంత సునామిని ఊహించలేని బయ్యర్లు ఒప్పేసుకుంటున్నారు. ఏదో హిట్ అనుకున్నాం కానీ బ్లాక్ బస్టర్ మించిపోయే రేంజ్ లో పెర్ఫార్మ్ చేయడం మాటలకు అందటం లేదు. కనీసం రెండు వారాలు ఈ జోరు కొనసాగేలా ఉంది.

ఇలాంటి టైంలో వారం తిరక్కుండానే టాక్సిక్ ఆగస్ట్ 26 వచ్చేస్తోంది. శుక్రవారం సంప్రదాయానికి భిన్నంగా బుధవారం విడుదలని ఎంచుకోవడం ద్వారా నిర్మాతలు లాంగ్ వీకెండ్ ని టార్గెట్ చేశారు. అయితే ఇరుముడి ఊపులో అందులోనూ ముత్యాల పల్లకి పాట కోసమే మళ్ళీ చూస్తున్న ఆడియన్స్ ప్రవాహంలో వాళ్ళను టాక్సిక్ వైపు తిప్పడం అంత సులభంగా ఉండదు. ముఖ్యంగా వయొలెన్స్ ఎక్కువగా ఉన్న టాక్సిక్ వైపు రెగ్యులర్ ఆడియన్స్ ని టర్న్ చేయాలంటే యష్ వాడుకోవాల్సిన ఆయుధం టాక్.

పబ్లిక్ యునానిమస్ గా ఉంటేనే టాక్సిక్ కు సపోర్ట్ దక్కుతుంది. ఒకవేళ టికెట్ రేట్ల పెంపు తీసుకొచ్చి వారం పది రోజులు హైక్స్ తెచ్చుకుంటే కనక అది ఇరుముడికే ప్లస్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే పెద్ది తర్వాత ఏ ఒక్క టాలీవుడ్ సినిమా ఏపీ తెలంగాణలో పెంపుకు వెళ్ళలేదు. అలాంటిది ఒక డబ్బింగ్ మూవీ తీసుకుంటే ఎంతో కొంత ప్రతికూలత అయితే వస్తుంది. దాన్ని తట్టుకోవాలన్నా టాక్సిక్ అదిరిపోయిందనే మాట కన్నా తక్కువ తెచ్చుకోకూడదు.

ఇరుముడిలోనూ క్రైమ్ ఎలిమెంట్స్, రివెంజ్ ఉన్నప్పటికీ తండ్రి కూతురి సెంటిమెంట్, రెండు అయ్యప్ప పాటలు, ఎమోషన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. అందుకే సిల్లీ అనిపించే కొన్ని లాజిక్స్ ని దర్శకుడు శివ నిర్వాణ క్రియేటివ్ లిబర్టీ పేరుతో వదిలేసినా జనం పట్టించుకోలేదు. గన్నులు, రక్తపాతం, రొమాన్స్ తో నిండిపోయిన టాక్సిక్ ముఖ్యంగా మాస్, యూత్ ని మెప్పించగలిగితే ఇరుముడి వేవ్ లోనూ నిలబడొచ్చు. ఎర్లీ ప్రీమియర్లు వేస్తారని టాక్ ఉంది. రేపు క్లారిటీ రావొచ్చు. 

This post was last modified on August 23, 2026 12:37 pm

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

2 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

2 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

3 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

3 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

3 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

4 hours ago