Movie News

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న విద్యార్థులు కిందపడి గాయపడిన ఘటన మినహా మిగిలినదంతా సాఫీగా జరిగిపోయింది. ప్రాంగణం మొత్తం విద్యార్థులు, అభిమానులతో కిక్కిరిసిపోయింది. మన ప్రేక్షకుల ప్రేమను కెజిఎఫ్ రూపంలో చవి చూసిన హీరో యష్ ప్రత్యేకంగా తెలుగులో అరగంట సేపు మాట్లాడి స్వీట్ షాక్ ఇచ్చాడు. ఇరవై సంవత్సరాల తమిళ స్టార్ల వల్ల కానిది స్టేజి మీద ఈ శాండల్ వుడ్ నటుడు చేసి చూపించాడు.

మల్లారెడ్డి యునివర్సిటిలో చేయడం ద్వారా టాక్సిక్ కు కలిగిన అతి పెద్ద ప్రయోజనం జన సమీకరణ. వేలాది విద్యార్థులు చదువుకునే ఆ విద్యాసంస్థల గ్రూప్ నుంచి స్టూడెంట్స్ కు ఈజీగా పాసులు వచ్చేస్తాయి. ఐడి కార్డు చూపించినా లోపలికి పంపిస్తారు. పైగా టాక్సిక్ లాంటి ప్యాన్ ఇండియా మూవీ కావడంతో సహజంగానే వాళ్ళు భారీ సంఖ్యలో విచ్చేశారు. ఒక దశలో యష్ టెన్షన్ పడ్డాడు. ఏదైనా జరగరానిది జరిగితే ఎలానే ఆందోళన బయట పడింది. తీవ్రంగా ఏదీ జరగకపోవడం రిలీఫ్. మల్లారెడ్డి వైరల్ స్పీచ్, ఆయన కోడలు స్టూడెంట్స్ కి ఇచ్చిన వార్నింగ్ బోనస్ అయ్యాయి.

నయనతార మినహాయించి మిగిలిన లేడీ క్యాస్టింగ్ కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి విచ్చేయడం ద్వారా టాక్సిక్ కు గ్లామర్ కోటింగ్ బాగా వచ్చింది. అందులో సినిమా గురించి ఒక్కొక్కరు ఒక్కో రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చేసరికి అంచనాలు మరింత పెరిగిపోయాయి. దిల్ రాజు రెండు వేల కోట్ల స్టేట్ మెంట్ కొంచెం అతిశయోక్తిగా అనిపించినా ఆ మాట సంగీత దర్శకుడు విశాల్ ద్వారా వచ్చింది కాబట్టి అంతగా ఫోకస్ పడలేదు.

మొత్తానికి టాక్సిక్ బృందం నుంచి ఒకే ఒక కీలక అడుగు టాలీవుడ్ ప్రమోషన్ల వరకు కరెక్ట్ గా పడింది. ఇలాంటి డబ్బింగ్ సినిమాలకు స్ట్రెయిట్ అన్నంత రేంజ్ లో మన ఆడియన్స్ ఎలాగూ స్వాగతం పలుకుతారు. ఎటొచ్చి అంచనాలు నిలబెట్టుకుంటే చాలు కలెక్షన్లు ఎక్కడికో వెళ్లిపోతాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన టాక్సిక్ లో యష్ తండ్రి కొడుకుగా డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎపిసోడ్స్, ట్విస్టులు గతంలో ఎప్పుడూ చూడని స్థాయిలో ఉంటాయట. 

This post was last modified on August 23, 2026 12:31 pm

Share

Recent Posts

మంత్రి ఎదుట జెండాలు పట్టుకుని రోబోల నిరసన..!

"హలో... ఐ యామ్ చిట్టి. స్పీడ్ వన్ టెరా హెర్ట్జ్, మెమరీ వన్ జెట్టా బైట్!" రజనీకాంత్ రోబో సినిమాలో…

31 minutes ago

సూర్యని ఊరిస్తున్న ట్రిపుల్ మైలురాయి

మొన్నటిదాకా వరస డిజాస్టర్లతో మార్కెట్ రిస్క్ లో పడేసుకున్న సూర్య మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. అసలు పెద్దగా అంచనాలు లేకుండా…

47 minutes ago

ర‌వితేజ కొడుకు… యాక్టింగ్ కోస‌మే డైరెక్ష‌న్

టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులకు చిన్నతనంలోనే సినిమా పురుగు కుట్టేస్తుంది. బాల నటుడిగానే అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఆ కోవలోనే…

2 hours ago

ప్ర‌పంచ‌పు వింత అంటే ఇదే: యువ‌కుడికి గ‌ర్భాశ‌యం!

మ‌హిళ‌లు మీసాలు పెంచ‌లేర‌ని.. పురుషులు గ‌ర్భాన్ని దాల్చ‌లేర‌ని సామెత‌!. అయితే.. ఇటీవ‌ల కాలంలో ర‌ష్యాకు చెందిన ఓ మ‌హిళ మీసాలు…

4 hours ago

జగన్ నమ్మకం ఏంటో అర్థం కావట్లేదే!

విశ్వాసం..అతి విశ్వాసం…ఈ రెండింటికి మధ్య ఒక సన్నని గీత ఉంది. ఈ విషయం తెలుసుకోకుండా చాలామంది రాజకీయ నేతలు తొందరపడుతుంటారు…

4 hours ago

టికెట్ రేట్ల పంచాయితీలో ‘ప్యారడైజ్’ తర్జన భర్జన

ఇంకో 15 రోజుల్లో విడుదల కాబోతున్న ది ప్యారడైజ్ టికెట్ రేట్లకు సంబంధించి ట్రేడ్ వర్గాల్లో చర్చలు మొదలైపోయాయి. పెంచాలా…

4 hours ago