Movie News

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు ఇవ్వాలంటే మాత్రం బండ్ల గ‌ణేష్ త‌ర్వాతే ఎవ‌రైనా. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప‌లు సంద‌ర్భాల్లో బండ్ల త‌న స్పీచుల్లో ఇచ్చిన ఎలివేష‌న్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. వాటిని ఎన్నో ఏళ్లుగా సోష‌ల్ మీడియాలో మీమ్ రెఫ‌రెన్సులుగా వాడుతున్నారు.

ప్ర‌స్తుత‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు.. జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంలో జైలు పాలైన‌పుడు హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో ఆయ‌న‌కు బండ్ల ఇచ్చిన ఎలివేష‌న్ కూడా ఒక రేంజిలో పేలింది. కొన్ని సంద‌ర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా బండ్ల త‌న‌దైన శైలిలో ప్ర‌సంగించాడు. ఇప్పుడు చిరు పుట్టిన రోజు వేడుక‌ల‌కు అతిథిగా వ‌చ్చిన బండ్ల‌.. త‌న మార్కు స్పీచ్‌తో అద‌ర‌గొట్టాడు.

”చిరు ఇండ‌స్ట్రీలో చాలామందిని తొక్కేశాడంటూ సోష‌ల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ చేసే ఆరోప‌ణ‌ల మీద బండ్ల త‌న స్పీచ్‌లో భ‌లే కౌంట‌ర్ వేశాడు. ఆయ‌న గురించి కొంత‌మంది మాట్లాడుతుంటారు చిరంజీవి తొక్కేశాడు అని. చిరంజీవి తొక్కుతాడా? చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా.. ఎక్కుతాడు. ఎక్కిస్తాడు. లేపుతాడు. లేపి కూర్చోబెడ‌తాడు. ఎవ‌రికి టాలెంట్ ఉంటే.. ఎవ‌రికి శ‌క్తి ఉంటే.. ఎవ‌రికి నిజాయితీ ఉంటే వాళ్ల‌ను ఉన్న‌త స్థానంలో కూర్చోబెట్ట‌డ‌మే మెగాస్టార్ చిరంజీవి ల‌క్ష్యం, ఆద‌ర్శం, అభిమానం” అని బండ్ల అన్నాడు.

అంత‌టితో ఆగ‌క‌కుండా.. చిరంజీవి క్యారెక్ట‌ర్ భావిత‌రాల‌కు ఒక రామాయ‌ణం, ఒక భ‌గ‌వ‌ద్గీత అంటూ బండ్ల త‌న‌దైన శైలిలో మెగాస్టార్‌కు ఎలివేష‌న్ ఇచ్చాడు. చిరు శ‌నివారం త‌న 71వ పుట్టిన రోజును జ‌రుపుకోన్నారు. ఏటా చిరు బ‌ర్త్ డేకి ముందు రోజు రాత్రి హైద‌రాబాద్‌లో అభిమానులు పెద్ద ఎత్తున వేడుక‌లు నిర్వ‌హించ‌డం, ఆ ఈవెంట్‌కు సినీ ప్ర‌ముఖులు ప‌లువురు హాజ‌రు కావ‌డం ఆన‌వాయితీ. ఈసారి బండ్ల గ‌ణేష్‌, బీవీఎస్ ర‌విల‌తో పాటు ప‌లువురు సెల‌బ్రెటీలు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

This post was last modified on August 21, 2026 11:24 pm

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

31 minutes ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

57 minutes ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

2 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

3 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

4 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

5 hours ago