Movie News

అనుష్క సినిమా అడ్రెస్ లేదేంటి

నాలుగు నెలల క్రితం అనుష్క కొత్త మలయాళం మూవీ ‘కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్’ ప్రమోషన్లు మొదలయ్యాయి. ట్రైలర్ అన్ని భాషల్లో బయటికొచ్చింది. అర్థమయ్యీ కానట్టు విచిత్రమైన అనుభూతి కలిగించినా ఒక విజువల్ గ్రాండియర్ గా రూపొందిందనే క్లారిటీ జనాలకు వచ్చింది. ఈ ప్యాన్ ఇండియా సినిమా అధికారిక ప్రకటన 2023లో వచ్చింది. షూటింగ్ కూడా ఆ ఏడాదే మొదలుపెట్టారు. ఇప్పటికి మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా సరైన అప్డేట్స్ రావడం లేదు.  

హోమ్ అనే చిన్న బడ్జెట్ చిత్రం తీసి ప్రశంసలు అందుకున్న రోజిన్ థామస్ దర్శకత్వం వహించిన కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్ రెండు భాగాలుగా తీస్తున్నారని మల్లువుడ్ టాక్. భారతీయ భాషలతో పాటూ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. తొమ్మిదవ శతాబ్దానికి చెందిన కదమట్టత్తు కథనార్ మహా పోరాట వీరుడు, మంత్రశక్తులు కలిగిన పూజారి. అతని కథే ఇప్పుడీ సినిమా. అనుష్క పోషిస్తున్న నీల క్యారెక్టర్ కథలో చాలా కీలకంగా ఆసాంతం ఉంటుంది.

హీరోగా నటించిన జయసూర్యకు బయట మార్కెట్లలో ఇమేజ్ లేకపోవడం ప్రతిబంధకంగా మారినట్టు కనిపిస్తోంది. ట్రైలర్ తర్వాత డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుందననుకుంటే దానికి భిన్నంగా పెద్దగా సౌండ్ చేయకపోవడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. ప్రముఖ నిర్మాత గోకులం గోపాలన్ నిర్మించిన కథానార్ కు మోక్షం ఎప్పుడు దక్కుతుందో అంతు చిక్కడం లేదు. 2026లో మిగిలిన అయిదు నెలల మెయిన్ స్లాట్స్ అన్నీ ఇతర సినిమాలు లాక్ చేసుకున్నాయి.

దీని సంగతలా ఉంచితే ఘాటీ దారుణంగా డిజాస్టర్ అయ్యాక అనుష్క మళ్ళీ కనిపించలేదు. ఆ సినిమా ప్రమోషన్లకు సైతం దూరంగా ఉంది. పెళ్లి వార్త గురించి కొన్ని గాసిప్స్ వినిపించినా తర్వాత అవన్నీ ఉత్తివేనని తేలిపోయింది. అనుష్క వయసు నాలుగు పదులు దాటిపోయింది. ఇప్పటికైనా వివాహ జీవితంలోకి అడుగు పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు కానీ దానికి సంబంధించి అప్డేట్ అయితే రావడం లేదు. పోనీ కథానార్ సస్పెన్స్ కైనా చెక్ పెడతారేమో చూడాలి. 

This post was last modified on August 20, 2026 5:05 pm

Share

Recent Posts

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

14 minutes ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

22 minutes ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

26 minutes ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

47 minutes ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

1 hour ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

2 hours ago