ఇంకొక్క రోజు వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానుంది ‘మాస్టర్’ సినిమా. తమిళంలో ప్రస్తుతం నంబర్ వన్ హీరో అనదగ్గ విజయ్ హీరోగా ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ రూపొందించిన ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఐతే విడుదల దగ్గర పడ్డ సమయంలో ఈ సినిమాలోంచి కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన క్లిప్స్ లీక్ అయినట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్లోని వాళ్లే కొన్ని సన్నివేశాల తాలూకు వీడియోలు లీక్ చేయడం షాక్‌కు గురి చేస్తోంది.
టెలిగ్రామ్ సహా కొన్ని వెబ్ సైట్లలో ‘మాస్టర్’ వీడియోలు పెట్టేశారట. ఇది చిత్ర దర్శక నిర్మాతలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. వెంటనే అన్ని వెబ్ సైట్ల నుంచి ‘మాస్టర్’ వీడియోలను తీయించడానికి గట్టి ప్రయత్నం జరిగింది. అన్నీ డెలీట్ అయ్యాయనే అంటున్నారు. ఈ వీడియోలు ఎవరు లీక్ చేశారన్నది ఇప్పటికే కనుక్కొన్నారట. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
నిజానికి ‘మాస్టర్’ లీక్స్ గురించి ముందు జనాలకు పెద్దగా తెలియలేదు. కానీ దర్శకుడు లోకేష్ కనకరాజ్.. పరోక్షంగా ఈ లీక్స్ గురించి ప్రస్తావిస్తూ, తమ కష్టాన్ని దోచుకోకండి అంటూ ఎమోషనల్‌గా ట్వీట్ వేశాడు. అలాగే నిర్మాణ సంస్థ కూడా ఇదే తరహాలో ట్వీట్ వేసింది. దీంతో విషయం ఏంటని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.
అభిమానులను అలెర్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ట్వీట్లు వేసి ఉండొచ్చు కానీ.. ఈ ట్వీట్ల వల్లే ఎక్కువమందికి లీక్స్ గురించి తెలిసి వాటి కోసం వెతికే పనిలో పడ్డారు. దీని వల్ల ఎక్కువ డ్యామేజ్ జరిగిందని అంటున్నారు. అసలే కరోనా దెబ్బకు ఏడాది పాటు సినిమాను ఆపుకుని ఎట్టకేలకు రిలీజ్ చేస్తుంటే.. ఇలాంటి సమయంలో లీక్స్, పైరసీ అంటే నిర్మాతల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ‘మాస్టర్’ అంచనాలను అందుకుని బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నందుకుని నిర్మాతల టెన్షన్ తీర్చేస్తుందేమో చూద్దాం.
This post was last modified on January 12, 2021 11:27 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…