సంక్రాంతి సీజన్లో మొదటగా వచ్చిన ‘క్రాక్’ రొటీన్ మాస్ మసాలా సినిమాలాగే కనిపించినా.. బాక్సాఫీస్ దగ్గర దాని హవా సాగుతోంది. మాస్ రాజా రవితేజ నుంచి ఆశించే అంశాలకు ఈ చిత్రంలో లోటు లేకపోవడం.. బోర్ కొట్టకుండా సినిమా సాగిపోవడం.. థియేటర్లలో ఇలాంటి మాస్ సినిమా చూసి చాలా కాలం అయిపోవడం.. దీనికి కలిసొస్తున్న అంశాలు.
ఇక ‘క్రాక్’లో ఎవ్వరూ ఊహించని హైలైట్ ఒకటుంది. అదే.. యాక్షన్ సన్నివేశాల టేకింగ్. ఇలాంటి మాస్ సినిమాలో ఫైట్లకు ఢోకా ఉండదు కానీ.. వాటి టేకింగ్ చాలా వరకు రొటీన్‌గానే ఉంటుంది. ఒకప్పుడైతే బౌన్స్ ఫైట్లు కొంచెం కొత్తగా అనిపించేవి కానీ.. ఈ మధ్య అవి మొహం మొత్తేస్తున్నాయి. యాక్షన్ సన్నివేశాల్లో ఏదో ఒక కొత్తదనం చూపిస్తే తప్ప అవి ప్రేక్షకులకు ఎక్కట్లేదు. ‘క్రాక్’ టీం అదే చేసింది. రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఒక్కో ఫైట్‌ను ఒక్కో స్టయిల్లో.. ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా తీర్చిదిద్ది సినిమాలో అవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా చేశారు.
ప్రథమార్ధంలో వచ్చే వూల్ఫ్ ఎటాక్ సీన్.. సెకండాఫ్‌లో వచ్చే బస్టాండ్ ఫైట్ దేనికదే ప్రత్యేకంగా ఉండి వావ్ అనిపిస్తాయి. ఈ రెండు యాక్షణ్ ఘట్టాల చిత్రీకరణలో కెమెరామన్ జీకే విష్ణు ప్రతిభ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మామూలుగా ఇలాంటి మాస్ సినిమాలకు సినిమాటోగ్రఫీ రొటీన్‌గా లాగించేస్తుంటారు కానీ.. విష్ణు భిన్నంగా ట్రై చేశాడు. అతను ఎంచుకున్న లైటింగ్ థీమ్స్, కెమెరా యాంగిల్స్ భిన్నమైన అనుభూతిని పంచుతాయి.
ముఖ్యంగా బస్టాండ్ ఫైట్ అయితే ప్రేక్షకులను విస్మయానికి గురి చేస్తుంది. అలాగే ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే ఫైట్… క్లైమాక్స్ ఫైట్ కూడా భిన్నంగా అనిపిస్తాయి. మాస్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇస్తాయి. రామ్ లక్ష్మణ్‌ల పనితనంతో పాటు దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్, కెమెరామన్ జీకే విష్ణు ప్రతిభ.. అన్నీ సరిగ్గా కుదిరాయి ఈ ఎపిసోడ్లలో. ఇండస్ట్రీలో ఇప్పుడు ‘క్రాక్’ యాక్షన్ సీక్వెన్స్‌ల గురించి ప్రత్యేక చర్చ నడుస్తుండటం విశేషం.
This post was last modified on January 11, 2021 6:39 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…