ఐదేళ్లు వెనక్కి వెళ్తే విజయ్ అనే తమిళ హీరోను తెలుగు ప్రేక్షకులు అస్సలు పట్టించుకునేవాళ్లు కాదు. అతడి సినిమాలు ఇక్కడ నామమాత్రంగా విడుదలయ్యేవి. తమిళంలో పెద్ద స్టారే కానీ.. తెలుగులో మాత్రం అతను ఎంత ప్రయత్నించినా క్రేజ్ సంపాదించుకోలేకపోయాడు. కార్తి లాంటి కొత్త హీరో కూడా ఇక్కడ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కానీ.. విజయ్ మాత్రం వెనుకంజలోనే ఉన్నాడు. ఐతే గత నాలుగైదేళ్లలో మాత్రం పరిస్థితి మారిపోయింది.
విజయ్ నెమ్మదిగా తెలుగులో పాగా వేశాడు. జిల్లా, అదిరింది, సర్కార్, బిగిల్ లాంటి సినిమాలకు ఇక్కడ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. రూ.10 కోట్లను మించి మార్కెట్ సంపాదించాడు విజయ్. ఇప్పుడు అతడి కొత్త చిత్రం ‘మాస్టర్’కు తెలుగులో మంచి క్రేజ్ కనిపిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ నెల 13న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతున్న ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వెయ్యి దాకా స్క్రీన్లు కేటాయిస్తుండటం విశేషం.
ప్రస్తుతం దాదాపుగా అందుబాటులో ఉన్న ప్రతి థియేటర్లోనూ ‘క్రాక్’ను నడిపిస్తున్నారు. అందులో సగానికి సగం తీసేసి విజయ్ చిత్రానికి 13న ఇచ్చేయనున్నారు. మల్టీప్లెక్సుల్లో ప్రస్తుతం సగం స్క్రీన్ల లోపే వాడుతున్నారు. ‘మాస్టర్’ రోజు అన్ని స్క్రీన్లూ ఓపెన్ చేసి పెద్ద సంఖ్యలో షోలు వేయబోతున్నారు. 14న ‘రెడ్’, ‘అల్లుడు అదుర్స్’ రానుండగా.. ముందు ఒక్క రోజు ‘మాస్టర్’ బాక్సాఫీస్‌ను ఏలబోతోంది.
ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం అదనపు షోలు వేయడానికి ప్రణాళికలు రచిస్తుండటం విశేషం. తమిళనాడు బోర్డర్లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విజయ్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ తెల్లవారుజామున కూడా షోలు వేయనున్నారట. ఇక్కడే ఇలా ఉంటే తమిళనాట ‘మాస్టర్’ హంగామా ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. విజయ్ కెరీర్లోనే ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 14న ‘విజయ్ ది మాస్టర్’ పేరుతో హిందీలో పెద్ద ఎత్తున సినిమా విడుదల కానుంది. మొత్తానికి ఈ సంక్రాంతికి విజయ్ హంగామా మామూలుగా ఉండేలా లేదు.
This post was last modified on January 11, 2021 11:56 am
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…