చిరు సినిమాలో ఖాన్.. అంతా ఫేకే

యంగ్ హీరోలందరూ ఒక్క సినిమాను ఒకే చేయడానికి కొన్ని నెలల పాటు ఆలోచిస్తుంటే… ఓ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఆ తర్వాత ముగ్గురు డైరెక్టర్లతో సినిమాలు కమిట్ అయ్యానని చెప్పి ఫ్యాన్స్‌కు అదిరిపోయే షాక్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.

యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ సినిమాను చిరూ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మెగా ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కకముందే మెగాస్టార్ 153 గురించి రోజుకో వార్త వినిపిస్తోంది. వాటిల్లో ఓ బాలీవుడ్ సూపర్ స్టార్, మెగాస్టార్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడనే రూమర్ కూడా ఒకటి.

తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ‘లూసిఫర్’ స్క్రిప్ట్‌ను మారుస్తున్న సుజిత్… ఒరిజినల్‌లో మిస్ అయిన ఎంటైర్‌టైన్‌మెంట్‌ను కూడా యాడ్ చేస్తున్నాడు. చిరంజీవి కోసం హీరోయిన్, డ్యూయెట్స్, ఐటెం సాంగ్ కూడా జత చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కనిపించబోతున్నాడని కొన్నిరోజుల క్రితం వార్తలు వినిపించాయి. ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, చిరంజీవి సినిమాలో అతిథి పాత్రలో కనిపించబోతున్నాడని టాక్ వినబడుతోంది. అయితే ఈ రెండు వార్తల్లోనూ ఏ మాత్రం నిజం లేదని ఫిల్మ్‌నగర్ టాక్.

ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో ‘రాధే’ సినిమా చేస్తున్న సల్మాన్… బాలీవుడ్ ప్రాజెక్టులతో తెగ బిజీగా ఉన్నాడు. మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ఫ’ సినిమాను కన్ఫార్మ్ చేసిన బన్నీ, ఐదు భాషల్లో తెరకెక్కే ఈ మెగా ప్రాజెక్ట్‌ కోసం గెటప్ పూర్తిగా మార్చేసి, చిత్తూరు యాస నేర్చుకుంటున్నాడు. కాబట్టి మెగాస్టార్ సినిమాలో ఈ ఇద్దరూ నటించే అవకాశం లేదని కొట్టిపడేస్తున్నారు టాలీవుడ్ జనాలు.