ఈ శనివారం ఉదయం ఆటలతో విడుదల కావాల్సింది ‘క్రాక్’ మూవీ. కానీ ఎప్పుడో రాత్రి 10 గంటలకు కానీ షోలు పడలేదు. నిర్మాతకు ఫైనాన్షియర్లతో ఉన్న గొడవల కారణంగా అనూహ్యంగా ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి. ఉదయం మొదలైన చర్చలు ఎంతకీ తెగలేదు. మార్నింగ్ షోలు క్యాన్సిలయ్యాక మ్యాట్నీల నుంచి సినిమా మొదలవుతుందని.. అవి కూడా క్యాన్సిలయ్యాక ఫస్ట్ షోలు పడతాయని ఆశించారు. కానీ చివరికి అవి కూడా రద్దయ్యాయి.
ఇక శనివారం సినిమా లేదనే అనుకున్నారంతా. అలాంటి సమయంలో సమస్య పరిష్కారమై.. చివరికి సెకండ్ షోలు, అవి కూడా పరిమితంగా పడ్డాయి. సినిమా ఇలా ఆలస్యం కావడం వల్ల కొన్ని కోట్ల రూపాయల ఆదాయంలో కోత పడ్డ మాట వాస్తవం. ఇది ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు.. ఇంకా మించి నిర్మాతకు నష్టం చేకూర్చేదే. ఐతే ఇంకో రకంగా మాత్రం సినిమాకు ఈ ఆలస్యం కలిసొచ్చింది.
ఉదయం మార్నింగ్ షోల సమయానికి ఉన్న పరిస్థితితో పోలిస్తే.. రాత్రి సెకండ్ షోలు పడే సమయానికి ‘క్రాక్’కు వచ్చిన క్రేజ్, హైప్ మాత్రం అనూహ్యం. అన్ని ఎదురు చూపుల తర్వాత సినిమా రిలీజయ్యే సరికి జనాల్లో ఈ సినిమా పట్ల ఎక్కడ లేని ఎగ్జైట్మెంట్ కనిపించింది. థియేటర్ల ముందు, లోపల ఒక సూపర్ స్టార్ సినిమా రిలీజైన స్థాయిలో హైప్ కనిపించింది. ఉదయం సినిమా ఆలస్యం వార్తలతో మొదలైన సోషల్ మీడియా చర్చ.. రాత్రికి బాగా ఊపందుకుంది. సినిమా రిలీజయ్యే సమయానికి ట్విట్టర్లో ఎక్కడ చూసినా ‘క్రాక్’ గురించే డిస్కషన్ నడిచింది.
రవితేజ వరుస ఫ్లాపుల మూలంగా బాగా డీలా పడిపోయిన అతడి అభిమానులు.. ‘క్రాక్’ ఇలా ఆలస్యమై, అతి కష్టం మీద రిలీజయ్యే సరికి ఒక్కసారిగా యునైట్ అయ్యారు. వాళ్లలో పునరుత్తేజం వచ్చినట్లయింది. మరోవైపు ‘క్రాక్’ ఎదురైన ఇబ్బంది మూలాన ఆ సినిమా పట్ల ఒక సానుభూతి వ్యక్తమైంది. ఇతర హీరోల అభిమానులు సైతం ఈ సినిమాకు బాసటగా నిలిచారు. సినిమాకు ఇప్పటిదాకా అయితే ఎక్కడా నెగెటివ్ టాక్ అన్నదే లేదు. మామూలు మాస్ సినిమానే అయినప్పటికీ దీని గురించి అందరూ పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. తొలి రోజు మెజారిటీ షోలు క్యాన్సిల్ కావడం వల్ల జరిగిన నష్టాన్ని ఈ పాజిటివ్ టాక్ కవర్ చేస్తుందనే ఆశతో చిత్ర బృందం ఉంది.
This post was last modified on January 10, 2021 10:02 am
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…