అదేంటి ఎవరైనా కొత్తగా ఆలోచించాలి కానీ అదే పనిగా పాత సినిమాలు చూడటం ఏమిటనే సందేహం వస్తే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది అర్థం కావాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ తవ్వాలి. ఇటీవలే విడుదలైన చెన్నై లవ్ స్టోరీ చూశాంగా. హీరో పోషించిన స్టీవెన్ శంకర్ పాత్రకు ఒక ట్విస్ట్ ఇచ్చి ప్రియురాలి కోసం పడే తపనని చాలా ఎమోషనల్ గా చూపించారు. నిజానికి ఈ ఎపిసోడ్ మీదే మిశ్రమ స్పందన వచ్చింది. ఫస్ట్ హాఫ్ మీద వచ్చినంత పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రెండో సగం మీద పూర్తిగా రాలేదన్నది వాస్తవం.
ముప్పై సంవత్సరాల క్రితం సుమన్ హీరోగా ‘ఆత్మబంధం’ అనే మూవీ వచ్చింది. చెన్నై లవ్ స్టోరీ తరహాలోనే అందులో కూడా ముఖ్యమైన మలుపులో దగ్గరి పోలిక కనిపిస్తుంది. ఇది పక్కనపెడితే లెనిన్ లో అఖిల్ విలన్ చేసిన కుట్ర వల్ల భాగ్యశ్రీ బోర్సేని పొడిచేయడం బాలకృష్ణ పాత సినిమా ‘క్రిష్ణబాబు’ నుంచి స్ఫూర్తి చెందినట్టు ఆధారాలతో సహా బయటికి వచ్చింది. పుష్పలో ఎర్రచందనం దుంగలను సముద్రం ద్వారా రవాణా చేసే ఎపిసోడ్ విజయ్ కాంత్ ‘కెప్టెన్ ప్రభాకర్’లో చూడొచ్చు.
అనిల్ రావిపూడి తీసిన మన శంకరవరప్రసాద్ గారులో తులసి, డాడీ, విశ్వాసం ఇలా బోలెడు రెఫరెన్సులు వెతుక్కోవచ్చు. తనే తీసిన ఎఫ్3లోనూ మనీ, గాండీవం లాంటి సినిమాలు గుర్తొచ్చేలా కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. అట్లీని స్టార్ డైరెక్టర్ గా మార్చిన విజయ్ తేరికి అసలు మూలం విజయ్ కాంత్ నటించిన ‘క్షత్రియుడు’. రెండు సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఒకేలా ఉంటుంది. నాగచైతన్య మజిలీకి మెయిన్ ఇన్స్ పిరేషన్ మణిరత్నం ‘మౌనరాగమే’. పోలికలు ఉంటాయి.
రామ్ చరణ్ రంగస్థలంలో కొన్ని చిరంజీవి ‘జాతర’ మూవీలో గమనించవచ్చు. తవ్వుకుంటూ పోతే బోలెడు బయటికి వస్తాయి కానీ వాటిని జెన్ జీ ఆడియన్స్ గుర్తుపట్టకపోవడమే పెద్ద ప్లస్. అందుకే వాళ్ళ అభిరుచికి అనుగుణంగా పాత కథలను ఎలా వండి వార్చాలో నవతరం దర్శకులకు తెలిసి ఉండాలి. అప్పుడే బ్లాక్ బస్టర్లు తలుపు తడతాయి. కొరియన్ మూవీస్ అవసరం లేకుండానే ఎలాంటి స్టోరీలు రాసుకోవచ్చో పైన చెప్పిన ఉదాహరణలు సాక్ష్యంగా పనికొచ్చాయిగా.
This post was last modified on July 28, 2026 8:28 am
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…