దర్శకుడు కావాలన్న లక్ష్యంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అనుకోకుండా హీరోలైన వాళ్లు చాలామందే కనిపిస్తారు టాలీవుడ్లో. అల్లరి నరేష్, నాని, రాజ్ తరుణ్, సప్తగిరి ఈ కోవలోని వాళ్లే. వీరి కంటే ముందు ఓ సీనియర్ నటుడు పూర్వాశ్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు. ఆయనే.. మాస్ రాజా రవితేజ. దర్శకుడవుదామన్న కోరికతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొన్నేళ్ల పాటు ఆ విభాగంలో పని చేశాడు రవితేజ.
ఐతే అనుకోకుండా నటుడిగా అవకాశాలు రావడం.. ఇంకొన్నేళ్లకు హీరోగా అరంగేట్రం చేయడం.. ఆ తర్వాత స్టార్ ఇమేజ్ సంపాదించడంతో మెగా ఫోన్ గురించి ఆలోచించాల్సిన అవసరం పడలేదు. ఐతే ఒకసారి దర్శకత్వం చేయాలని కోరిక పుట్టాక ఆ పురుగు తొలుస్తూనే ఉంటుంది. రవితేజకు సైతం ఆ కోరిక లేకపోలేదట. భవిష్యత్తులో తాను దర్శకత్వం చేపట్టే అవకాశాలున్నట్లు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా రవితేజే క్లారిటీ ఇచ్చాడు.
తన కొత్త సినిమా ‘క్రాక్’ ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి ఇచ్చిన ఓ వీడియో ఇంటర్వ్యూలో రవితేజ దర్శకత్వం చేపట్టడం గురించి మాట్లాడాడు. ముందుగా మీలో ఉన్న స్పెషల్ టాలెంట్స్ ఏంటి అని ఇంటర్వ్యూయర్ అడిగితే.. గోపీచంద్ అందుకుని.. డైరెక్షన్ చేయగలరు, భవిష్యత్తులో ఆయన దర్శకత్వం చేస్తారు అన్నాడు. ఇంతలో రవితేజ అందుకుని.. భవిష్యత్తులో డైరెక్షన్ చేసే అవకాశాలున్నాయి.. చూద్దాం ఏం జరుగుతుందో అని అన్నాడు.
దీన్ని బట్టి రవితేజకు మెగా ఫోన్ పట్టే ఆశలు ఉన్నాయనే అనుకోవచ్చు. ఆ ఆలోచన లేకుండా అయితే ఈ మాట అనడు కాబట్టి ఫ్యూచర్లో ‘కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వ: రవితేజ’ అనే కార్డ్ చూస్తామేమో. ప్రస్తుతానికైతే రవితేజ కొన్నేళ్ల వరకు ఖాళీ లేకుండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. మంచి డిమాండ్ ఉన్న ఈ టైంలో దర్శకత్వం చేసే సాహసాలకు దిగకపోవచ్చు.
This post was last modified on January 9, 2021 5:09 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…