ఐదు రోజుల ముందు తమిళ సినీ పరిశ్రమకు ఎక్కడ లేని ఉత్సాహాన్నిస్తూ తమిళనాట 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకునేందుకు అనుమతులు ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. హమ్మయ్య థియేటర్లకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని సంతోషించారు అక్కడి జనాలు. కానీ ఆ ఆనందం మూణ్నాళ్ల ముచ్చటే అయింది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంబంధిత జీవోను వెనక్కి తీసుకోవాలని.. 100 శాతం ఆక్యుపెన్సీ సాధ్యం కాదని తేల్చేసింది. కేంద్రం ఉద్దేశాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నడుచుకునే పరిస్థితి లేదక్కడ. సంక్రాంతి సినిమాలు 50 శాతం ఆక్యుపెన్సీతో నడవాల్సిందే. ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాల సినీ పరిశ్రమలకు కూడా షాకే.
తమిళనాట అనుమతులొచ్చాయి.. మా సంగతేంటి అంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ సహా కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు విజ్ఞప్తులు వెళ్లాయి. అక్కడి ప్రభుత్వాలు కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్లు వార్తలొచ్చాయి. దీంతో మన దగ్గరా 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడవబోతున్నాయని.. సంక్రాంతి సినిమాలే ఈ ఆఫర్ దక్కబోతోందని.. వసూళ్లు రెట్టింపు అవుతాయని ఆశలు పెట్టుకున్నారు నిర్మాతలు.
కానీ ఇంతలో కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి షాకిచ్చింది. దీంతో మన దగ్గరా పరిస్థితి మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో అనుమతులు ఇచ్చినా.. కేంద్రం ఇదే తరహాలో బ్రేక్ వేస్తుందని అర్థమవుతోంది కాబట్టి ఇక్కడి ప్రభుత్వాలు ఆ దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలే లేవు.
కేంద్రాన్ని కాదని పరిశ్రమ కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ధైర్యం చేయకపోవచ్చు. కాబట్టి సంక్రాంతి సినిమాలు 100 శాతం ఆక్యుపెన్సీ మీద ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోంది. ఐతే ఇంకొన్ని రోజుల్లోనే ఇండియా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ మొదలవుతోంది కాబట్టి రెండు నెలల్లో పరిస్థితిలో మార్పు రావచ్చు. వేసవి సమయానికి కేంద్రం దేశవ్యాప్తంగా 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం కల్పించవచ్చు.
సంక్రాంతి అంటే తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు మాత్రమే కీలకం. కానీ వేసవి అంటే అన్ని చోట్లా భారీ చిత్రాలు విడుదలవుతాయి. వ్యాక్సినేషన్‌కు తోడు వేసవిలో వాతావరణం కూడా కరోనా ప్రభావాన్ని తగ్గిస్తుందన్న అంచనాల నేపథ్యంలో అప్పటికి 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులిచ్చే అవకాశాలే ఎక్కువ.
This post was last modified on January 8, 2021 10:24 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…