దర్శకులు హీరోలు కావడం ఇండస్ట్రీకి కొత్త కాదు. కాకపోతే సక్సెస్ అయినవాళ్లు తక్కువ. ఉదాహరణకు ఎస్వి కృష్ణారెడ్డి మంచి పీక్స్ లో ఉన్నప్పుడు మేకప్ వేసుకుని కథానాయకుడయ్యారు. ఉగాది, అభిషేకం రెండూ దెబ్బేశాయి. దీంతో మళ్ళీ నటన జోలికి పోలేదు. కానీ డైరెక్టర్ గా మునుపటి వైభవం పూర్తిగా అందుకోలేకపోయారు. దాసరి నారాయణరావు లాంటి కొందరు మాత్రమే రెండు విభాగాల్లోనూ బలమైన ముద్ర వేసి బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ వంతు వచ్చింది.
అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన డిసి ఆగస్ట్ 7 విడుదలకు రెడీ అయ్యింది. ఇందులో లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమవుతున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో వామికా గబ్బి హీరోయిన్ గా అనిరుద్ సంగీత దర్శకత్వంలో పెద్ద బడ్జెట్ తో నిర్మించారు. ట్రైలర్ కూడా వచ్చేసింది. తమను అన్యాయంగా వేధిస్తే ఎవరినైనా చంపడానికి వెనుకాడని దేవదాసు, చంద్ర ప్రేమకథగా దీన్ని తెరకెక్కించారు. మూడు నిమిషాల వీడియోలో ఫుల్ వయొలెన్స్ నింపేశారు.
చూడగానే వావ్ అనే ఫీలింగ్ కలిగేలా లేదు కానీ ఏదో దాచే ప్రయత్నం చేసి అంచనాలు వచ్చేలా చేయడానికి కష్టపడ్డారు. లోకేష్ డెబ్యూకే ఇంత ఇంటెన్స్ పాత్ర చేయడం ఆశ్చర్యం. అందులోనూ హింస ఎక్కువగా ఉండే ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ లో అనుభవమున్న నటీనటులు అయితే బాగుంటుంది. వామికా గబ్బికి ఎక్స్ పీరియన్స్ ఉంది కానీ ఇప్పటి దాకా యాక్షన్ కెమెరా చెప్పిన లోకేష్ కు ఇప్పుడు వేరొకరి డైరెక్షన్లో యాక్టింగ్ చేయడం కొత్త అనుభవం.
తెలుగులోనూ రిలీజవుతున్న డిసి డిసెంబర్ 7 కొరియన్ కనగరాజ్ తో పాటు పోటీ పడనుంది. ఒకవేళ లోకేష్ కనగరాజ్ కనక హీరోగా హిట్టు కొడితే కొత్త కెరీర్ దక్కినట్టే. అయితే వెంటనే చేయడానికి అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ తన చేతిలో ఉంది. రాకా అయ్యాక బన్నీ దీని సెట్స్ లో అడుగు పెడతాడు. కూలి గాయం నుంచి బయట పడాలని చూస్తున్న లోకేష్ కనగరాజ్ కు ఐకాన్ స్టార్ సినిమా చాలా కీలకం కానుంది.
This post was last modified on July 23, 2026 6:07 am
ఏ ఇద్దరు నేతలు కలిసినా.. ఏ ఇద్దరు నాయకులు ఫోన్లు చేసుకున్నా.. ఇదే అంశంపై చర్చ సాగుతోంది. ఏపీలో తాజాగా…
సంతానం లేని ఆ దంపతులు తల్లి చనిపోయిన పసి బిడ్డను దత్తత తీసుకొని గుండెలకు హత్తుకున్నారు. ఆలానా పాలనా చూస్తూ…
ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి కాల పరిమితి తీరిపోయిన నేపథ్యంలో కొత్తగా పాలక మండలిని ఏర్పాటు…
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రిపీట్ కాంబో ఎట్టకేలకు రంగంలోకి దిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,…
భారత దేశంలో గ్రాండ్ ఓల్డ్ ట్రంక్ పార్టీ కాంగ్రెస్ కి గతమంతా ఘనం. అయితే, కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ…
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా AI,…