Movie News

అనిల్ ఇచ్చిన బూస్ట్ సరిపోతుందా

తెలుగులో బజ్ కోసం పోరాడుతున్న జన నాయకుడుకి అనిల్ రావిపూడిని రంగంలోకి దించడం ద్వారా టీమ్ తెలివైన ఎత్తుగడ వేసింది. ఎలాగూ భగవంత్ కేసరి రీమేకనే విషయం అందరికి తెలిసిపోయింది కాబట్టి వీలైనంత వరకు చాలా మార్పులు చేశామనే సందేశం టాలీవుడ్ ఆడియన్స్ కి చెప్పడం కోసం నిర్మాతతో కలిసి ఇంటర్వ్యూ ప్లాన్ చేయడం తెలివైన ఆలోచనే. అయితే ఇది ఎంతవరకు ఫలితం ఇస్తుందని ఆలోచిస్తే ఉపయోగాలు, నష్టాలు రెండూ కనిపిస్తున్నాయి.

బాలయ్య భగవంత్ కేసరిని జనాలు సూపర్ హిట్ చేసి పెట్టారు. ఓటిటిలో వచ్చాక భారీ ఎత్తున వ్యూస్ వచ్చాయి. తమిళ డబ్బింగ్ కూడా అందుబాటులో పెట్టడంతో వాళ్ళు కూడా బాగానే చూశారు. హిందీలోనూ రెస్పాన్స్ వచ్చింది. ఇంత జరిగిన తర్వాత జన నాయకుడు మళ్ళీ ఆ భాషల్లో అనువాదం చేయడం విచిత్రమే. అందుకే బుకింగ్స్ ఆశించినంత వేగంగా లేవనేది వాస్తవం. తమిళనాడులో బ్లాక్ టికెట్లు అమ్ముతుంటే మన దగ్గర షోలు నిండటానికి యుద్ధం చేయాల్సి వచ్చేలా ఉంది.

సరే ఎలాగూ తన కథే కాబట్టి అనిల్ రావిపూడి వీలైనంత పాజిటివ్ విషయాలు చాలా పంచుకున్నారు. గోట్ షూటింగ్ లో విజయ్ ని కలుసుకోవడం, మహేష్ బాబుకి ఫోన్ చేసి ఇదంతా చెప్పడం, కేవలం మెయిన్ పాయింట్ మాత్రమే తన స్టోరీ నుంచి తీసుకున్నారని వివరించడం ఇలా బోలెడు సంభాషణ ఉంది. అయితే కేవలం దీని ఆధారంగా జనాలు పొలోమని టికెట్లు కొనరు. టాక్ వచ్చాక అప్పుడు డిసైడ్ చేద్దాంలెమ్మని అనుకునేవాళ్లు ఎక్కువగా ఉంటారు.

తమిళనాడు సిఎం కావడంతో విజయ్ కనీసం ఒక ఈవెంట్ లో పాల్గొనే అవకాశం కూడా లేకుండా పోయింది. ప్రజలు సమస్యల్లో ఉంటే ఇలా సినిమా ప్రమోషన్లు చేయడం ఏమిటని ప్రతిపక్షాలు కామెంట్స్ చేస్తాయని భావించి కనీసం చెన్నైలో వేడుక చేయడానికి కూడా ఇష్టపడలేదు. హీరోయిన్ పూజా హెగ్డే సైతం తన ప్రాధాన్యం తక్కువగా ఉండటంతో పబ్లిసిటీకి దూరంగా ఉంది. ఇక అనిరుధ్ రవిచందర్ సంగతి తెలిసిందే. మన దగ్గరేమో కానీ కోలీవుడ్ లో మాత్రం రికార్డులు ఖాయం. 

This post was last modified on July 22, 2026 8:16 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

7 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

9 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

10 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

10 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

11 hours ago