ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని కంటెంట్ కొత్తగా సృష్టించి దాని ద్వారా మూవీ మీద బజ్ వచ్చేలా చేయడంతో ఆయన శైలి మళ్ళీ ఎవరికి రాలేదు. చాలా మంది ట్రై చేశారు కానీ వర్కౌట్ కాక తిరిగి రొటీన్ పబ్లిసిటీకి వచ్చారు. అనిల్ లో అంత ప్రత్యేకత ఉంది కాబట్టి ఎవరికీ ఎస్ చెప్పని నయనతార మన శంకరవరప్రసాద్ గారు షూటింగ్ ముందే ప్రోమో వీడియోలో నటించింది.
తాజాగా సహ అనే సినిమా కోసం సంగీత దర్శకుడు శేఖర్ చంద్రని వాడుకుని టీమ్ ఒక వెరైటీ స్ట్రాటజీ ఆలోచించింది. ఆయన కిడ్నాప్ అయినట్టుగా ఒక వార్త సృష్టించి ఉదయం సోషల్ మీడియాలో తిప్పింది. అఫ్కోర్స్ దీన్ని ఒక్కరు కూడా నమ్మలేదు అది వేరే విషయం. తీరా చూస్తే అది ఈ వారం విడుదల కాబోతున్న సహ లిరికల్ సాంగ్ కోసం షూట్ చేసిన వీడియో కోసం పడిన తిప్పలు. ఇంతా చేసి నాలుగు నిమిషాలకు దగ్గరగా ఉన్న వీడియోలో ఫన్, ఎగ్జైట్ మెంట్ ఏదీ లేదు.
కొత్తగా ఆలోచించడం తప్పు కాదు. కానీ అది వింతగా అనిపించకూడదు. సహ బృందం ఇది ఎందుకు చెక్ చేసుకోలేదో. కిడ్నాప్ వార్తను వైరల్ చేయాలని చూడటం చాలా అవుట్ డేటెడ్ ఐడియా. ఇలాంటివి జనం నమ్మకపోతే కామెడీ అయిపోతుంది. దీంతో అసలు కంటెంట్ మీద అనుమానాలు వచ్చే ప్రమాదముంది. సిల్లీ జోకులకు నవ్వే రోజులు పోయాయి. వెరైటీగా చేస్తున్నామని మనం అనుకోకూడదు. చూసేవాళ్ళు భావించాలి. సహ ఇధి మిస్సయ్యింది.
బజ్ రావాలంటే ఇలాంటివి చేయక తప్పదు. కానీ అవి కన్విన్సింగ్ గా ఉండాలి. ఆడియన్స్ ఇదేదో బాగుందే అని ఫీలయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. అంతే కానీ తోచింది చేసుకుంటూ పోతే అసలుకే మోసం వస్తుంది. ఇంటెన్స్ లవ్ స్టోరీగా రూపొందిన సహని త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఈ మధ్య టీజర్ కు బాగానే హడావిడి చేశారు. కల్ట్, ఇప్పటిదాకా రాని ప్రేమకథగా ఊదరగొట్టారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలా ఏదో చేయబోయి ఏదో చేసి రివర్స్ ఫలితం అందుకున్నారు.
This post was last modified on July 14, 2026 9:57 pm
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…