రాజకీయాల్లోకి రాకముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు ఆరు నెలల తర్వాత విడుదలవుతున్నా కూడా రిలీజ్ డేట్ల ఆటలు తప్పడం లేదు. ముందు జూలై 24 అన్నారు. దానికి అనుగుణంగానే ఓవర్ సీస్ బుకింగ్స్ మొదలైపోయాయి. యుకెలో ఆల్రెడీ కోటి రూపాయల గ్రాస్ వచ్చేసింది. ఈలోగా హఠాత్తుగా ఒక రోజు ముందే జూలై 23 రిలీజ్ ప్రకటించబోతున్నారని లేటెస్ట్ అప్డేట్. విచిత్రం ఏమిటంటే ఈ రెండు తేదీలు ఇండియాలో అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు.
చేతిలో కేవలం తొమ్మిది రోజులే ఉన్నప్పటికీ నిర్మాణ సంస్థ అనుసరిస్తున్న విధానం పట్ల ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్లు చేయడం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆల్రెడీ మలేషియాలో అయిపోయింది కానీ చెన్నైలో ఒక వేడుక నిర్వహించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న విజయ్ దీనికి సుముఖంగా లేరని, ఒకవేళ అలా చేస్తే ప్రతిపక్షాలు దాన్నో ఆయుధంగా వాడుకుంటాయని అనుమానపడుతున్నారట.
సరే ఈవెంట్ చేసినా చేయకపోయినా ముందైతే జన నాయకుడు నుంచి అఫీషియల్ నోట్ రావడం అత్యవసరం. ట్రేడ్ టాక్ ప్రకారం జన నాయకుడు తెలుగు వెర్షన్ కు సంబంధించిన థియేటర్ అగ్రిమెంట్లు మొదలైపోయాయట. ఆ వారంలో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో థియేటర్ల ఫీడింగ్ కు ఇది ఉపయోగపడుతుందనే నమ్మకంతో బయ్యర్లు పెద్ద ఎత్తున స్క్రీన్లు లాక్ చేస్తున్నారని సమాచారం. ఓపెనింగ్స్ హెవీగా ఉంటాయని వాళ్ళ నమ్మకం.
ఏపీ తెలంగాణ వరకు చూసుకుంటే ఈ సినిమాకో సమస్య ఉంది. భగవంత్ కేసరి రీమేక్ కాబట్టి దీన్ని మళ్ళీ చూసేందుకు సాధారణ ప్రేక్షకులు ఏ మేరకు ఆసక్తి చూపిస్తారనేది వేచి చూడాలి. అయితే సెకండాఫ్ లో చాలా మార్పులు చేశారు కాబట్టి వాటి కోసం వస్తారని ఫ్యాన్స్ నమ్మకం. లీకైన వెర్షన్ గురించి యునానిమస్ ఫీడ్ బ్యాక్ కనిపించని నేపథ్యంలో జన నాయకుడు ఒకవేళ బ్లాక్ బస్టర్ కొట్టిందంటే మాత్రం ఆ క్రెడిట్ మొత్తం నిస్సందేహంగా విజయ్ కే దక్కుతుంది.
This post was last modified on July 14, 2026 9:43 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…