Movie News

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది. నటుడిగానే కాక నిర్మాతగా, స్టూడియో యజమానిగా నాగార్జున ఎంతో సంపాదించాడు. ఆయనకు వేరే వ్యాపారాలూ ఉన్నాయి. కానీ తాను ఎన్ని విజయాలు సాధించినా, ఎంత డబ్బు సంపాదించినా.. కొడుకులు సక్సెస్ కానపుడు సంతోషంగా ఎలా ఉంటారు? పెద్ద కొడుకు నాగచైతన్య కెరీర్ ఆరంభంలో కొంచెం కష్టపడి.. తర్వాత మిడ్ రేంజ్ హీరోగా స్థిరపడ్డాడు. అయినా సరే ఒక దశలో చైతూ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు. మరోవైపు అఖిల్ హీరోగా నిలదొక్కుకోలేక ఎంత ఇబ్బంది పడ్డాడో తెలిసిందే. 

దీంతో కొడుకులిద్దరినీ ఎలాగైనా నిలబెట్టాలని నాగ్ ఎంతో తపించాడు. ఈ క్రమంలోనే తన సినిమాలను కూడా పక్కన పెట్టి వారి కెరీర్ల మీద ఫోకస్ చేశాడు. గీతా ఆర్ట్స్‌లో ‘తండేల్’ లాంటి ప్రామిసింగ్ ప్రాజెక్టు సెట్ చేశాడు. నాగ్ అభిమాని అయిన చందు మొండేటి రూపొందించిన ఈ చిత్రం మంచి ఫలితాన్నందుకుంది. నాగ్ మరీ ఇన్వాల్వ్ కాకపోయినా.. ఈ ప్రాజెక్టు సెట్ కావడంలో నాగ్ పాత్ర కూడా ఉంది. చైతూ కెరీర్‌కు కీలకం కావడంతో నాగ్ ముందే సినిమా చూసి మార్పులు చేర్పులు సూచించాడు.

ఇక అఖిల్ మూవీ ‘లెనిన్’లో నాగ్ ఎంతగా ఇన్వాల్వ్ అయ్యాడో తెలిసిందే. ఈ చిత్రంలో నిర్మాణ భాగస్వామి కావడమే కాదు.. మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. తన సినిమాలకు కూడా పెట్టనంత ఎఫర్ట్ నాగ్ ఈ సినిమా కోసం పెట్టాడని టీం చెబుతున్న మాటల్ని బట్టి అర్థమవుతోంది. ఈ సినిమా రిలీజ్ రోజు సక్సెస్ సెలబ్రేషన్లలో అఖిల్.. తండ్రిని పట్టుకుని ఎంత ఎమోషనల్ అయ్యాడో తెలిసిందే. ఆ టైంలో నాగ్ కూడా కన్నీళ్లు పెట్టేసుకున్నారు. 

మొత్తానికి ఏడాదిన్నర వ్యవధిలో అక్కినేని అన్నదమ్ములిద్దరూ హిట్లు కొట్టేశారు. ఇక మిగిలింది నాగార్జునే. ఆయన కూడా ఒక పెద్ద హిట్ కొట్టి చాలా ఏళ్లయింది. ఇప్పుడాయన తన వందో చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి ఇప్పటిదాకా ఏ విశేషమూ పంచుకోలేదు. సైలెంటుగా షూటింగ్ చేసుకుపోతున్నాడు నాగ్. చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశముంది. తమిళ దర్శకుడు రా.కార్తీక్ రూపొందిస్తున్న ఈ చిత్రం కూడా విజయవంతం అయితే.. అక్కినేని వారి జైత్రయాత్ర పరిపూర్ణం అవుతుంది.

This post was last modified on July 14, 2026 10:20 am

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

4 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

4 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

5 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

5 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

6 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

6 hours ago