ఒకప్పుడైతే ఒక హీరో, ఒక హీరోయిన్ కలిసి వరుసబెట్టి సినిమాలు చేసేవాళ్లు. పది, ఇరవై సినిమాలు కూడా కలిసి చేసిన జోడీలు ఉన్నాయి. రాధ, సుహాసిని, రాధిక లాంటి హీరోయిన్లు ఒక్కొక్కరితో రెండంకెల సంఖ్యలో సినిమాలు చేశారు. మిగతా ఇండస్ట్రీల్లో ఇలా హిట్ పెయిర్లను రిపీట్ చేసేవాళ్లు. కానీ గత 20 ఏళ్లలో పరిస్థితులు చాలా మారిపోయాయి. ఎంత హిట్ కాంబినేషన్ అయినా సరే.. ఒక హీరో హీరోయిన్ కలిసి రెండు మూడుకు మించి సినిమాలు చేయట్లేదు.
వాటిలోనూ మధ్య మధ్యలో చాలా గ్యాప్ తీసుకుంటుున్నారు. ఇలాంటి టైంలో ఒకప్పటి టాలీవుడ్ టాప్ బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్లోనూ అవకాశాలు అందుకుంటున్న రకుల్ ప్రీత్.. ఒక సీనియర్ హీరోతో రెండేళ్ల వ్యవధిలో మూడో సినిమాలో నటించబోతుండటం.. అందులో రెండు సినిమాలు నెల వ్యవధిలో అనౌన్స్ కావడం విశేషం. ఆమె అలా జోడీ కడుతున్న హీరో మరెవరో కాదు.. అజయ్ దేవగణ్.
అజయ్, రకుల్ తొలిసారిగా ‘దే దే ప్యార్ దే’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అందులో అజయ్ మధ్య వయస్కుడిగా కనిపిస్తే.. అతడితో ప్రేమలో పడే యువతిగా రకుల్ నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించి.. వీరిని హిట్ పెయిర్‌గా మార్చింది. రకుల్ పెర్ఫామెన్స్‌కు ఇంప్రెస్ అయిన అజయ్.. తన స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కనున్న ‘మే డే’లో తనకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ మధ్యే ఆ చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ఇంతలో అజయ్, రకుల్ కాంబినేషన్లో మూడో సినిమా అనౌన్స్ కావడం విశేషం.
ఆ సినిమా పేరు.. థ్యాంగ్ గాడ్. ఇందులో అజయ్, రకుల్‌లతో పాటు సిద్దార్థ్ మల్హోత్రా కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఐతే రకుల్ ఇందులో ఎవరితో జోడీ కడుతోందో తెలియట్లేదు. ఇంద్రకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ నిర్మించనుంది. ఈ నెల 21నే ‘థ్యాంక్ గాడ్’ సెట్స్ మీదికి వెళ్లనుంది. ఇంకతుముందు రకుల్.. సిద్దార్థ్‌తో ‘అయ్యారీ’లోనూ నటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on January 7, 2021 4:39 pm
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…
ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరో జన్మ అంటూ ఉంటే.. మళ్లీ తెలుగు వాడిగానే…
కొత్త ఏడాది మొదలయ్యాక సినీ ప్రియులందరి దృష్టి సంక్రాంతి చిత్రాల మీదే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో భారీ…
స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో పారిశ్రామికవేత్తలతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు..మంత్రి నారా లోకేశ్, ఎంపీ రామ్మోహన్ నాయుడు,…
సంక్రాంతికి వస్తున్నాం లాంటి మిడ్ రేంజ్ సినిమా వారం రోజులుగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న తీరు చూసి ట్రేడ్ పండిట్లు…