Movie News

చీరకే అందం తీసుకొచ్చిన శృతి

వెండితెరపై ఎప్పుడూ కాస్త బోల్డ్, వెస్ట్రన్ లుక్స్‌తో ట్రెండ్ క్రియేట్ చేసే శ్రుతి హాసన్ ఈసారి పూర్తిగా రూట్ మార్చేసింది. ఎప్పుడూ ఒకే స్టైల్‌లో కనిపిస్తే బోర్ కొడుతుందనుకుందో ఏమో గానీ, అచ్చమైన సాంప్రదాయ అవతారంలోకి మారిపోయి నెటిజన్లకు ఒక క్రేజీ షాక్ ఇచ్చింది. ట్రెడిషనల్ వేర్‌లో కూడా తనదైన ముద్ర వేయవచ్చని నిరూపిస్తూ ఆమె ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.

ఈ స్పెషల్ షూట్ కోసం శ్రుతి హాసన్ డిఫరెంట్ షేడ్ ఉన్న సిల్వర్ గ్రీన్ పట్టుచీరను సెలెక్ట్ చేసుకుంది. మోడ్రన్ ట్రెండ్‌కు తగ్గట్టుగా హెవీ జ్యువెలరీ జోడించి ఈ లుక్‌ను మరింత ఇంట్రెస్టింగ్‌గా ప్లాన్ చేసింది. వీటన్నింటికీ మించి తన లాంగ్ కర్లీ హెయిర్‌ను వెనుక భాగంలో ఒక వింటేజ్ క్లిప్‌తో అలంకరించిన విధానం ఈ ఫోటోషూట్‌కే హైలైట్‌గా నిలిచింది. సినిమాల విషయానికి వస్తే శ్రుతి హాసన్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీతో పాటు పలు పాన్ ఇండియా ప్రాజెక్టులతో తన కెరీర్‌ను చాలా బ్యాలెన్స్‌డ్‌గా ముందుకు తీసుకెళ్తోంది.

కేవలం కమర్షియల్ హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న విభిన్నమైన రోల్స్ వైపు మొగ్గు చూపుతోంది. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల్లో భాగం అవుతోంది. ఆమధ్య వారణాసి సినిమా కోసం సంచారి అంటూ పాట పాడి హై వోల్టేజ్ వైభ్ తీసుకు వచ్చింది. అలాగే పెద్ది సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ తో సర్ ప్రైజ్ ఇచ్చింది.

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార అనే సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో నటిస్తోంది. అలాగే మరో తమిళ సినిమా లైన్ లో ఉంది. ఇక ఎంత బిజీగా ఉన్నా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఫ్యాన్స్‌తో ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలు పంచుకోవడం ఈమెకు అలవాటే. శ్రుతి అనగానే మైండ్‌లోకి వచ్చే రాక్ స్టార్ ఇమేజ్‌ను పక్కనపెట్టి, ఇలా పద్ధతిగా హోమ్లీ లుక్‌లో కనిపించడం నిజంగా ఒక మంచి చేంజ్ ఓవర్ అనే చెప్పాలి. పెళ్లిళ్లు లేదా పండగల సీజన్‌లో ఎలాంటి స్టైలింగ్ ఇష్టపడే వారికైనా ఈ లుక్ ఒక పర్ఫెక్ట్ ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుంది. ఏదేమైనా రొటీన్ గ్లామర్ షో కంటే ఇలాంటి సరికొత్త మేకోవర్స్ ద్వారానే శ్రుతి హాసన్ ఇటు యూత్‌ను, అటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఈజీగా మెప్పించగలదని ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతోంది.

This post was last modified on July 7, 2026 10:10 pm

Page: 1 2

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

10 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

4 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

6 hours ago