తమిళంలో రెండేళ్ల కిందట వచ్చిన ‘తడమ్’ అనే సూపర్ హిట్ సినిమాను ఎంచుకుని దాని రీమేక్‌లో నటించాడు టాలీవుడ్ యువ కథానాయకుడు రామ్. ఆ చిత్రమే.. రెడ్. రామ్‌తో ఇంతకుముందు నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ లాంటి క్లాస్ లవ్ స్టోరీలు తీసిన కిషోర్ తిరుమల.. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను డైెరెక్ట్ చేశాడు. రామ్ నుంచి ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి మాస్ మూవీ తర్వాత వస్తున్న చిత్రమిది.
దాని తర్వాత మాస్ ప్రేక్షకుల్లో రామ్ మీద ఉన్న అంచనాలను అందుకునేలా తమిళ వెర్షన్‌కు కొంచెం మాస్ టచ్ ఇచ్చినట్లున్నారు తెలుగులో. ఒరిజినల్లో కథ ప్రధానంగా సినిమా నడుస్తుంది. కానీ తెలుగులోకి వచ్చేసరికి మంచి మసాలా ఉన్న ఐటెం సాంగ్ జోడించారు. హెబ్బా పటేల్‌తో కలిసి దించక్ దించక్ అంటూ రామ్ వేసిన నాటు స్టెప్పులు ఈ పాటలో బాగా హైలైట్ అయ్యాయి. ఇప్పుడు ఒక రొమాంటిక్ సాంగ్ గ్లింప్స్ రిలీజ్ చేసి యూత్‌ను ఆకర్షించే ప్రయత్నం చేసింది ‘రెడ్’ టీమ్.
నువ్వే నువ్వే అంటూ సాగే పాటలో ఒకటిన్నర నిమిషం నిడివితో వీడియో రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్ మాళవిక శర్మ హాట్ లుక్స్, రామ్ డ్యాన్సులతో పాటు.. చివర్లో కొసమెరుపులా ఉన్న లిప్ లాక్ అందరి దృష్టినీ ఆకర్షించింది. రామ్ ఇంతకుముందు జగడం, ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో హీరోయిన్లతో కిస్ సీన్లు చేశాడు కానీ.. అవి లైట్‌గా ఉంటాయి. కానీ ‘రెడ్’ కోసం మాళవికతో కొంచెం ఘాటుగానే లిప్ లాక్ చేశాడని ‘నువ్వే నువ్వే’ పాట టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇంతకుముందు ‘నేల టిక్కెట్టు’ సినిమాలో మాళవిక బాగానే అందాలు ఆరబోసింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో ఆమెకు అవకాశాలు లేకుండా పోయాయి.
ఇప్పుడు ఆమె ఆశలన్నీ ‘రెడ్’ మీదే ఉన్నాయి. ఇందులో ఆమెది మరీ పెద్ద పాత్రేమీ కాకపోయినా సినిమాలో కీలకంగా ఉంటుంది. ఈ పాత్రతో సాధ్యమైనంతగా ఆకట్టుకోవడానికి తనకున్న ఒక్క పాటలోనే హాట్ హాట్‌గా కనిపించినట్లుంది మాళవిక. ‘రెడ్’ ఈ నెల 14న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 6, 2021 4:19 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…